టెన్షన్‌ పెడుతున్న చరణ్‌

‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా గురించి చడీచప్పుడు లేకపోవడంతో అక్టోబర్‌ 1 రిలీజ్‌ని ఆ బృందం సీరియస్‌గా లేదేమో అని కొందరు ఔత్సాహికులు దసరా రిలీజ్‌కి సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే గోవిందుడు ఆన్‌ షెడ్యూల్‌ ఉన్నాడని…

‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా గురించి చడీచప్పుడు లేకపోవడంతో అక్టోబర్‌ 1 రిలీజ్‌ని ఆ బృందం సీరియస్‌గా లేదేమో అని కొందరు ఔత్సాహికులు దసరా రిలీజ్‌కి సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే గోవిందుడు ఆన్‌ షెడ్యూల్‌ ఉన్నాడని ప్రెస్‌నోట్‌ ద్వారా నిర్మాత బండ్ల గణేష్‌ తెలియజేసాడు. ఆడియో ముందుగా ప్రకటించినట్టే 
ఈ నెల 15న రిలీజ్‌ కానుంది. 

అక్టోబర్‌ 1న ఆరు నూరైనా ఈ చిత్రం రిలీజ్‌ కావడం ఖాయమని అంటున్నారు. అక్టోబర్‌ 2, 3 పబ్లిక్‌ హాలిడేస్‌ కావడం… దాని వెంటే శని, ఆదివారాలు ఉండడంతో అక్టోబర్‌ 1 డేట్‌ని ఎట్టి పరిస్థితుల్లో మిస్‌ కారాదని ప్రయత్నిస్తున్నారు. చరణ్‌ దసరా బరిలో దిగడంతో చాలా చిత్రాల నిర్మాతలు అయోమయంలో పడ్డారు. 

గోపీచంద్‌ లౌక్యం, నాగచైతన్య ఒక లైలా కోసం వంటి చెప్పుకోతగ్గ చిత్రాలు కూడా ఇప్పుడు కొత్త రిలీజ్‌ డేట్‌ వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. పోనీ ఈ నెలలోనే వచ్చేద్దామంటే పవర్‌, ఆగడు వరుసగా రిలీజ్‌ అవుతుండడంతో థియేటర్లు దొరికే అవకాశాలే కనిపించడం లేదు.