తెలుగు సినిమాకి యుఎస్ మార్కెట్లో ఎంత సత్తా ఉందనేది తరచుగా రుజువు అవుతూనే ఉంది. సూపర్‌హిట్ టాక్ తెచ్చుకున్న ఎంటర్టైనర్స్ అక్కడ మిలియన్ డాలర్లు అవలీలగా సాధిస్తున్నాయి. అయితే ఇంతదాకా రెండు మిలియన్ డాలర్ల వరకు మాత్రం తెలుగు సినిమా రీచ్ కాలేదు. అత్తారింటికి దారేది క్లోజ్‌గా వచ్చింది కానీ ఆ మార్కు వరకు వెళ్లలేదు.
ఆ ఫీట్ సాధించే తొలి చిత్రం ‘ఆగడు’ అవుతుందని అంచనాలున్నాయి. డిజాస్టర్ టాక్ వచ్చిన ‘1 నేనొక్కడినే’తో కూడా మహేష్ యుఎస్‌లో మిలియన్ డాలర్లు సాధించాడు. ఇంత హైప్ ఉన్న ‘ఆగడు’తో ఓపెనింగ్స్‌తోనే మిలియన్ డాలర్లు సాధ్యమవుతుందని అనుకుంటున్నారు. దానికి తోడు 14 రీల్స్ వాళ్లు ఈ చిత్రాన్ని అక్కడ కనీ వినీ ఎరుగని రీతిలో విడుదల చేయబోతున్నారు.
వారి పబ్లిసిటీ టాక్టిక్స్కి తోడు మహేష్ స్టార్ పవర్ జత కలిసిన ఈ చిత్రానికి శ్రీను వైట్లకి ఉన్న బ్రాండ్ వేల్యూ కూడా హెల్ప్ అవుతుంది. డీసెంట్ టాక్ వచ్చినా కానీ ఆగడు యుఎస్‌లో రెండు మిలియన్లు సాధించి రికార్డు సృష్టిస్తుందని అంచనాలున్నాయి. ఇక బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చినట్టయితే బెంచ్ మార్క్ ఎంతకి సెట్ అవుతుందో మరి.