చిరంజీవితో ఇంద్ర 2?

చిరంజీవి తిరిగి సినిమాల్లోకి రావడమైతే ఖాయమైపోయింది. రాజకీయాల్లో ఇప్పుడాయన చేయడానికి కూడా ఏమీ లేకపోవడంతో ఇక సినిమాలు చేసుకోవడమే ఉత్తమమని భావిస్తున్నారట. అయితే చిరంజీవి 150వ సినిమాని ఎవరు చేస్తారు? వినాయక్‌ డైరెక్ట్‌ చేస్తాడనే…

చిరంజీవి తిరిగి సినిమాల్లోకి రావడమైతే ఖాయమైపోయింది. రాజకీయాల్లో ఇప్పుడాయన చేయడానికి కూడా ఏమీ లేకపోవడంతో ఇక సినిమాలు చేసుకోవడమే ఉత్తమమని భావిస్తున్నారట. అయితే చిరంజీవి 150వ సినిమాని ఎవరు చేస్తారు? వినాయక్‌ డైరెక్ట్‌ చేస్తాడనే టాక్‌ వినిపిస్తోంది కానీ ఇది అధికారికంగా ఖరారు కాలేదు. 

చిరంజీవి ఇంకా ఏ కథనీ ఓకే చేసినట్టు సమాచారం లేదు. చిరంజీవికి క్లోజ్‌ అయిన పలువురు రచయితలు ఆయన కోసం కథ రాసే పనిలో బిజీగా ఉన్నారు. చిరంజీవి తనని పిలిచి కథ రాయమని చెప్పారని… ప్రస్తుతం అదే పనిలో ఉన్నానని చిన్నికృష్ణ చెప్పాడు. ఇంద్ర చిత్రానికి కథ అందించిన చిన్నికృష్ణ బద్రీనాధ్‌, జీనియస్‌ చిత్రాలతో క్రేజ్‌ కోల్పోయాడు. 

అయినప్పటికీ చిరంజీవి తనని పిలిచి కథ సిద్ధం చేయమని చెప్తున్నాడంటే ఇందులో నిజమెంతో తనకే తెలియాలి. చిన్నికృష్ణ అయితే తాను మరో ఇంద్ర స్థాయి కథని అందిస్తానని బీరాలు పలుకుతున్నాడు. ఇప్పుడు తాను ఎలాంటి సినిమా చేస్తే కరెక్ట్‌ అనే విషయంలో చిరంజీవి కూడా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారట. రాజకీయ నేపథ్యమున్న సినిమా చేయాలా, సందేశాత్మక చిత్రం చేయాలా లేక కమర్షియల్‌ కథకే ప్రాధాన్యమివ్వాలా అని ఆయన ఆలోచనలో పడ్డట్టు సమాచారం.