‘1 నేనొక్కడినే’ పరాజయం పాలవడంతో మహేష్ ఇక ఇప్పట్లో ప్రయోగాలు చేయరాదని డిసైడయ్యాడు. తాను ప్రయోగాత్మకంగా ప్రయత్నించిన ప్రతిసారీ మహేష్‌కి చుక్కెదురైంది. కమర్షియల్ సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో మహేష్ ఎప్పుడూ మినిమం గ్యారెంటీ సినిమాలిచ్చాడు.
రాంగ్ టైమ్‌లో 1 చేయడం వల్ల నంబర్ వన్ హీరోగా తన స్థానాన్ని సిమెంట్ చేసుకునే టైమ్‌లో మహేష్ వెనుక పడ్డాడు. పవన్‌కళ్యాణ్ ఒకేసారి సూపర్ ఫామ్‌లోకి రావడంతో నం.1 ప్లేస్ కోసం మహేష్ మరింతగా కష్టపడాల్సి వస్తోంది. ఈ టైమ్‌లో ప్రయోగాల జోలికి పోవడం కంటే వరుసగా కమర్షియల్ సినిమాలు చేయడమే ఉత్తమమని మహేష్ భావిస్తున్నాడు.
ఆగడు, కొరటాల శివ సినిమా తర్వాత ఏం చేయాలని మహేష్ ఇంకా డిసైడ్ కాలేదు కానీ అది కూడా కమర్షియల్ ఎంటర్టైనరే అవుతుందట. మహేష్ వచ్చే మూడేళ్లలో అయితే ప్రయోగాత్మక చిత్రాల జోలికి వెళ్లడట. త్రివిక్రమ్, పూరి తదితర దర్శకులకే మహేష్‌తో ఇమ్మీడియట్‌గా ఛాన్సులొచ్చే ఛాన్సుంది.