నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ లాంటి సెన్సిటివ్ సినిమాలు అందించాడు కిషోర్ తిరుమల. ఆయన తన తరువాతి సినిమాను హీరో నానితో చేయబోతున్నాడు. టైటిల్ కూడా ఫిక్సయింది. చిత్రలహరి అని. అయితే నిజమో కాదో కానీ, ఓ గమ్మత్తయిన గ్యాసిప్ ఇప్పుడు గుప్పుమంది.
అదేమింటే, కిషోర్ తిరుమల ప్రేమలో పడ్టారన్నది. అంట సెన్సిటివ్, ఎమోషనల్ సినిమాలు అందించారు అంటే అతగాడిలో కూడా కాస్త భావుకత, సున్నితత్వం వుండే వుంటాయి మరి. అందువల్ల ప్రేమలో పడడంలో ఆశ్చర్యం ఏముంది? అయితే అలా ప్రేమలో పడింది ఓ కొత్త నటితో అని. ఆమె ఇప్పటికే ఒకటి రెండు సినిమాల్లో చిన్న పాత్రలు వేసి, నవంబర్ లో ఫస్ట్ వీక్ లో విడుదలయ్యే ఓ సినిమాలో కూడా నటించిన ఆ నటితో ప్రేమలో పడ్డారని టాక్ వినిపిస్తోంది.
ఇదేమీ తప్పు కాదు. కాని విషయం అయితే కాదు. నిజమో కాదో తెలియని గ్యాసిప్ అంతే. అయితే ఇంకా అసలు సంగతికి రాలేదు. కిషోర్ తిరుమల ప్రేమించిన ఆ అమ్మాయి చెప్పిన లైన్, చిన్న కథ ఆధారంగానే కిషోర్ తిరుమ నాని సినిమాకు కథ తయారు చేసుకున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే కిషోర్ తిరుమలకు మంచి సపోర్ట్ ఇచ్చే జీవిత భాగస్వామి దొరికినట్లే. ఆమె కథలు అందిస్తుంది. ఇతగాడు సినిమాలు తయారు చేసేస్తారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇదేనేమో?