హీరో రామ్ అంటే మొదట్నించీ మాస్ సినిమాలే. కానీ నేను శైలజ లాంటి క్లాస్ సినిమా హిట్ ఇచ్చింది. కానీ ఆ తరువాత హైపర్ అంటూ మాస్ బాటకు వెళ్తే, ఫలితం రివర్స్ అయింది. సర్లే అని మళ్లీ ఉన్నది ఒకటే జిందగీ అంటూ క్లాస్ సినిమా చేయడానికి ప్రయత్నిస్తే ఫలితం అంత ఎంకరేజింగ్ లేదు.
రామ్ లాంటి మాస్ హీరోలకు ఓపెనింగ్స్, మినిమమ్ కలెక్షన్లు మూలం. ఎందుకంటే దాన్ని బట్టే సినిమా బడ్జెట్ అయినా, బయ్యర్ల రెస్పాన్స్ అయినా వుంటుంది. కానీ ఇప్పుడు రామ్ సినిమా 20కోట్ల రేంజ్ లోనే వుంది. జిందగీ సినిమాను ఆంధ్ర అంతా కలిపి పది కోట్ల రేంజ్ లోనే మార్కెట్ చేయగలిగారు. అది కూడా కొన్ని ఏరియాలు నిర్మాత దగ్గరే వున్నాయి.
తొలి రోజు వసూళ్లు రెండు రాష్ట్రాలు కలిపి పెద్ద గొప్పగా లేవనే చెప్పాలి. నైజాం మాత్రం బాగుంది. సీడెడ్ నలభై లక్షల రేంజ్ లో కాస్త నీరసంగానే వుందని వినికిడి. కోటి పది లక్షల వరకు వుందని తెలుస్తోంది. థియేటర్లు దొరకడంతో చాలా చోట్ల ఒకటికి రెండు థియేటర్లు వేసేసారు. దాని వల్ల ఫుల్స్ తగ్గాయి. సినిమా టూ క్లాస్ అన్న టాక్ రావడంతో ఇప్పుడు ఆదివారం తరువాత ఎలా వుంటుందన్నది చూడాలి. ఈస్ట్ లాంటి ఏరియాల్లో ఈ సినిమా కోటిన్నర వసూలు చేయాలంటే మాటలు కాదు. రాజా ది గ్రేట్ లాంటి ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ నే ఆ జిల్లాలో కొటిన్నర లాగింది ఫస్ట్ వీక్ లో.
నైజాం మాత్రం కలెక్షన్లు శనివారం కూడా బాగున్నాయి కాబట్టి, నిర్మాత వాటా బాగానే రావచ్చు. మొత్తం మీద చూసుకుంటే, ఈ సినిమా ఫలితంతో ఇక మళ్లీ రామ్ ఇప్పట్లో వెంటనే క్లాస్ సినిమా చేసే ఐడియా చేయకపోవచ్చు. దిల్ రాజు నిర్మాణంలో నక్కిన త్రినాధరావు డైరక్షన్ సినిమా ఓకె చేసాడు. నక్కిన త్రినాధరావు లైన్ కామెడీ లైన్ నే. అందువల్ల రామ్ మళ్లీ తన పాత ట్రాక్ మీదకు వస్తున్నట్లు కనిపిస్తోంది.