భలే భలే మగాడివోయ్ సినిమా చూసిన వాళ్లు ఆహా.. ఏమి లావణ్యం అనుకున్నారు. సోగ్గాడే చిన్ని నాయనా చూస్తే భలే వుంది కదా అనుకున్నారు. కానీ మిస్టర్ దగ్గరకు వచ్చేసరికి ఏంటిలా వుందీ అనుకున్నారు. లేటెస్ట్ గా ఉన్నది ఒకటే జిందగీ చూసిన తరువాత 'అయిపోయింది. ఇంక లావణ్య త్రిపాఠీ ఇన్నింగ్స్ ముగిసిపోయినట్లే' అనుకుంటున్నారు.
ఉన్నది ఒకటే జిందగీలో లావణ్యకు రెండు సమస్యలు. ఫస్ట్ హాఫ్ లో అనుపమను చూసిన కళ్లతో లావణ్యను చూడలేకపోవడం. దానికి తోడు ముదిరిపోయినట్లున్న లావణ్య ఫేస్, దానికి భయంకరమైన మేకప్, ఆ డ్రెస్ సెన్స్.. అబ్బో.. జనాలు గొల్లు మంటున్నారు ఆమెను చూసి. అనుపమ పెర్ ఫార్మెన్స్ ముందు, ఆమె ఎక్స్ ప్రషన్స్ ముందు, క్యారెక్టర్ ముందు లావణ్య అన్ని విధాలా తేలిపోయింది. పైగా ఆ మందు కొట్టడం, ఆ సీన్లు అన్నీ చిరాకు అనిపించేసాయి. మేకప్ కొన్ని చోట్ల ఓవర్ అనిపించేసింది.
దీంతో లావణ్య త్రిపాఠీ ఇక పెద్ద సినిమాలకు పనికిరాదేమో అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆల్ మోస్ట్ ఒకేసారి అడుగుపెట్టినా, మిగిలిన యంగ్ హీరోయిన్ల కన్నా వేగిన ఫేడవుట్ అవుతోంది. లావణ్య తరువాత ఈ లైన్ లో రెజీనా రెడీగా వుంది.