బాహుబలి ట్రయిలర్ వచ్చేసింది. జనం అహో..అన్నారు. పాటలు విడుదలయిన తరువాత తొలి పాట విడియో వచ్చింది. చూస్తే, ఒకటో, అరో కొత్త సీన్లు, మళ్లీ ట్రయిలర్ లో సీన్లే రిపీట్..రిపీట్..సరే, మళ్లీ ఇప్పుడు మరో పాట విడియో వచ్చింది..అదీ డిటోనే..ఒకటి రెండు కొత్త సీన్లు, ట్రయిలర్, మేకింగ్ విడియో ముక్కలు కలిపి వదిలారు.
దీంతో యూట్యూబ్ లో హిట్ లు వస్తున్నాయి తప్ప, జనాలకు ఆసక్తి కలగడం లేదు. ఎందుకంటే ఏముందో అని చూస్తున్నారు. హిట్ లు వస్తున్నాయి. సూపర్ అనుకుంటున్నారు..కానీ జనాలు మాత్రం ఏముందీ ఇందులో అని పెదవి విరుస్తున్నారు.
Click Here For Nippule Swasaga Song
విషయం ఏమిటంటే బాహుబలి టీమ్ కు ఈ సంగతి తెలుసంట..కానీ బాలీవుడ్ లో ఇలా వన్ టు టు మినిట్ సాంగ్ విడియోలు వదలడం అలవాటు. మనకు ఆ అలవాటు లేదు. ఇప్పుడు బాహుబలి హిందీ వెర్షన్ మీద కూడా ఎక్కువ కాన్సన్ ట్రేట్ చేయడంతొ, అలా విడుదల చేయక తప్పడం లేదు. అలా అని వున్న గుట్టంతా బయట పెట్టడం ఇష్టం లేదు. అందుకే ఇలా అరకొరగా విడుదల చేస్తున్నట్లు సమాచారం.