చౌదరికి షాక్ ఇచ్చిన పవన్?

తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే. మెగాతమ్ముడు కదా పవన్ కళ్యాణ్ అంటే. అందుకే ఆయన స్టయిల్ కూడా అంతే. జనసేన జనసేనే.. సినిమా సినిమానే. ఈ సంగతి ఇప్పుడు తెలిసివచ్చింది తెలుగునాట రెండు ఛానెళ్లకు.…

తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే. మెగాతమ్ముడు కదా పవన్ కళ్యాణ్ అంటే. అందుకే ఆయన స్టయిల్ కూడా అంతే. జనసేన జనసేనే.. సినిమా సినిమానే. ఈ సంగతి ఇప్పుడు తెలిసివచ్చింది తెలుగునాట రెండు ఛానెళ్లకు. పవన్ కు అనుకూలంగా వుంటూ వస్తున్నాయి టీవీ 9, ఎన్టీవీ చానెళ్లు. ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి అయితే గతంలో పవన్ కు ఓ కారు కూడా గిఫ్ట్ గా ఇచ్చినట్లు గుసగుసలు వున్నాయి.

అయితే ఇప్పుడేమయింది. అజ్ఞాతవాసి లాంటి ప్రెస్టీజియస్ ప్రొడక్ట్ ఆడియో ఫంక్షన్ రైట్స్ ఈ రెండు చానెళ్ల రైవల్ అయిన టీవీ 5 తన్నుకుపోయింది. దీనికి చాలా కారణాలు వున్నాయి. ఒకటి టీవీ 5ఆఫర్ చేసిన అమౌంట్. టీవీ 5జనాలతో  హారిక హాసిని యూనిట్ కు వున్న స్నేహబంధాలు.

టీవీ 5కు ఆడియో పంక్షన్ హక్కులు వెళ్లిపోయాయని తెలిసి టీవీ 9 రవిప్రకాష్ చెప్పడంతో ఎన్టీవీ నరేంద్ర చౌదరి స్వయంగా ఫవన్ కు ఫోన్ చేసినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ‘మీకు మంచి సపోర్ట్ ఇస్తున్నాం, జనసేనకు కూడా సపోర్ట్ ఎలా ఇస్తున్నామో తెలుసు కదా? మరి ఇప్పుడు మాకు కూడా ఈ సినిమా ఆడియో ఫంక్షన్ టెలికాస్ట్ అవకాశం ఇవ్వాలి కదా’ అని అడిగినట్లు తెలుస్తోంది.

దీనికి పవన్ చాలా కూల్ గా ‘అది సినిమా. ఆ బిజినెస్, ఆ యూనిట్ అంతా వేరు, జనసేన వేరు. నేనేం చేయలేను’ అన్న రీతిలో సమాధానం చెప్పేసినట్లు వినిపిస్తోంది. ఇది విని ఎన్టీవీ చౌదరి, ఆయన ద్వారా తెలుసుకుని టీవీ 9 రవిప్రకాష్ మరేం మాట్లాడకుండా వుండిపోయారట. అయితే వాళ్లను ఊరడించడానికి హారిక హాసిని యూనిట్, పవన్ ఎక్స్ క్లూజివ్ ప్రమోషన్ ఇంటర్వూలు ఆ రెండు చానెళ్లకే ముందుగా ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.

అయినా ఈ లోగా టీవీ 9లో పవన్ కు యాంటీ ప్రచారం కాస్త స్టార్ట్ అయిపోయినట్లు ఫ్యాస్స్ పీలవుతున్నారు. బలమైన రెండు చానెళ్లను దూరం చేసుకుంటే జనసేనకు కాస్త కష్టమే. మరి పవన్ ఏం మంత్రం వేసి మళ్లీ వాళ్లను దగ్గరకు తీసుకుంటారో చూడాలి.