సుధీర్ వర్మ-శర్వా సినిమా డవుట్?

డైరక్టర్ సుధీర్ వర్మకు కేశవ సినిమా తరువాత మళ్లీ ఇప్పటి దాకా మరో సినిమా లేదు. కేశవ హిట్ నా, ఏవరేజ్ నా అన్న సంగతి ట్రేడ్ వర్గాలకు తెలుసు. వార్తలు, చెప్పుకోవడాలు ఎలా…

డైరక్టర్ సుధీర్ వర్మకు కేశవ సినిమా తరువాత మళ్లీ ఇప్పటి దాకా మరో సినిమా లేదు. కేశవ హిట్ నా, ఏవరేజ్ నా అన్న సంగతి ట్రేడ్ వర్గాలకు తెలుసు. వార్తలు, చెప్పుకోవడాలు ఎలా వున్నా అసలు కలెక్షన్లు, ప్రాఫిట్ లాస్ అన్నది నిర్మాతకు తెలుసు. అయితే హారిక హాసిని సంస్థ మాత్రం సుధీర్ తో సినిమా చేయడానికి కమిట్ అయివుంది.

ఆ మేరకు శర్వానంద్ హీరోగా ప్రాజెక్టు సెట్ చేసింది. కానీ ఆ కథ విషయంలో శర్వానంద్ మార్పులు అడుగుతున్నాడని, ఎంటర్ టైన్ మెంటే వుండేలా చూడమన్నాడని గతంలోనే వార్తలు వినిపించాయి. శర్వానంద్ ఆ సినిమాను ఎందుకో లేట్ చేస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు, మళ్లీ లేని పోని గ్యాసిప్ లు వస్తాయని సినిమాకు ఓపెనింగ్ అయితే చేసేసారు.

మారుతి-నాగ చైతన్యతో అదే సంస్థ నిర్మించే సినిమా ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్ కు వెళ్లడానికి రెడీ అయిపోతోంది. కానీ సుధీర్ వర్మ సినిమా జాడ మాత్రం లేదు. ఈలోగా శర్వానంద్ ఓ సినిమా స్టార్ట్ చేసేసాడు. హను రాఘవపూడి డైరక్షన్ లో. ఆ సినిమా అయితే తప్ప సుధీర్ వర్మ సినిమా చేయడు.

కానీ ఇప్పుడు మరో సినిమా దిల్ రాజు కొసం హరీష్ శంకర్ డైరక్షన్ లో ఓకె చేసేసాడు. అంటే హను సినిమా తరువాత దాని మీదకు వెళ్లిపోతాడా?. ఇంక సుధీర్ వర్మ మాఫియా డాన్ సినిమా, రెండు గెటప్ లు అన్నీ పక్కన పెట్టేసినట్లేనా? అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ముందుగా వచ్చేది మా సినిమానే

ఇదిలా వుంటే హరీష్ శంకర్ సినిమా చేసినా, హను రాఘవపూడి సినిమా చేసినా, మరే సినిమా చేసినా కూడా ముందుగా విడుదలయ్యేది తమ సినిమానే అని అంటున్నాయి సితార ఎంటర్ టైన్ మెంట్స్ వర్గాలు. తమ సినిమా నూటికి నూరు శాతం వుంటుందని, అంతే కాదు, మహానుభావుడు సినిమా తరువాత విడుదలయ్యే శర్వానంద్ సినిమా తమదే అని ఢంగా భజాయిస్తున్నాయి. శర్వానంద్ –హను రాఘవపూడి సినిమా ముందు స్టార్ట్ అయిన మాట వాస్తవమే అని, అయితే హీరోయిన్ డేట్ అడ్జస్ట్ మెంట్ కోసం తప్ప వేరు కాదని, తమ సినిమానే ముందుగా విడుదలవుతుందని అంటున్నాయి ఆ వర్గాలు. ఆ తరువాతే హరీష్ శంకర్ సినిమా వుంటుందంటున్నాయి.