సినిమాకు ముందే ‘గోల్డ్’ టూర్

సినిమా తీయడం కన్నా ఓపెనింగ్స్ తెచ్చుకోవడం కీలకం. అదే ఇప్పుడు టాలీవుడ్ లో నిర్మాతలు, హీరోల తక్షణ కర్తవ్యం అయిపోయింది. అందుకే ఆ దిశగా ప్రచారం కోసం నానా ప్లాన్ లు వేయాల్సి వస్తోంది.…

సినిమా తీయడం కన్నా ఓపెనింగ్స్ తెచ్చుకోవడం కీలకం. అదే ఇప్పుడు టాలీవుడ్ లో నిర్మాతలు, హీరోల తక్షణ కర్తవ్యం అయిపోయింది. అందుకే ఆ దిశగా ప్రచారం కోసం నానా ప్లాన్ లు వేయాల్సి వస్తోంది. ఫస్ట్ వీక్ లో విడుదల కాబోతున్న సునీల్ వీడు గోల్డ్ ఎహె కూడా ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఒక్కో పాటను ఒక్కో ఊరిలో విడుదల చేయాలని ప్లాన్ చేసింది. 

హీరో సునీల్ తో పాటు యూనిట్ అంతా విశాఖ, తిరుపతి, విజయవాడ ఇలా పెద్ద ఊళ్లకు వెళ్లి అక్కడి థియేటర్లలో పాటలను లైవ్ లో లాంచ్ చేస్తారు. అలాగే ఆ ఊళ్లలోని మాల్స్ లో ఫంక్షన్లు చేస్తారు. వీలయితే ప్రేక్షకులతో మీట్ లు నిర్వహిస్తారు. అలా అన్ని పాటలు తలా ఒక ఊరిలో చేసాక, హైదరాబాద్ లో ట్రయిలర్ విడుదల ఫంక్షన్ నిర్వహిస్తారు. 

సో, ఆ విధంగా సినిమాను జనాలకు కాస్త నోటెడ్ చేసాక, విడుదల అన్న మాట. దీని వల్ల కాస్త అదనపు ఖర్చే కానీ, తగ్గ ఫలితం వుంటుందని భావిస్తున్నారు. వీడు గోల్డ్ ఎహె సినిమాలో సునీల్ తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. వీరు పోట్ల దీనికి దర్శకుడు.