దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అలా ఖాళీగా వుండిపోవడం మీడియాకు అస్సలు నచ్చడం లేదు పాపం. ఎన్టీఆర్ ను ఈయన అడగడు. మహేష్ తో సినిమా వద్దు రామ్ తో చేసుకోండి అనేలాంటి పిచ్చి మాటలు ఎన్టీఆర్ మాట్లాడడు.
కానీ త్రివిక్రమ్ ఖాళీగా వుండడం మీడియాకు నచ్చడం లేదు. అందుకే మీడియానే కాస్టింగ్ అదీ ఫిక్స్ చేసేసి సినిమా తీయించేస్తోంది.
రామ్ తో సినిమా అని చెప్పి,హీరోను ఫిక్స్ చేసేసారు. పూజా హెగ్డే, రష్మిక, కీర్తి లాంటి క్రేజీ హీరొయిన్లు వుండగా, అనుపమ లాంటి డిమాండ్ లేని హీరోయిన్ గా మీడియానే ఫిక్స్ చేసేసింది.
ఇక సపోర్టింగ్ ఆర్టిస్ట్ లను ఫిక్స్ చేయాల్సి వుంది.ఎందుకంటే తివిక్రమ్ టెక్నికల్ టీమ్ ఎలాగూ పర్మనెంట్ గా వుంటుందిగా.
కానీ తివిక్రమ్ మాత్రం ఇవేమీ పట్టకుండా అవసరం అయినపుడు మిత్రుడు పవన్ కళ్యాణ్ ను కలుస్తూ, మిగిలిన టైమ్ లో ఎన్టీఆర్ సినిమా వన్ లైన్ ఆర్డర్ ను రెడీ చేసుకుంటూ కూర్చున్నారు. ఆయన అలా వుండగానే సినిమా కూడా మీడియానే రెడీ చేసేస్తుందేమో?