సినిమా.. ప్రేమ.. సమ్మోహనం

ఇంద్రగంటి-సుధీర్ బాబు-అదితిరావ్ హైదరి కాంబినేషన్ లో తయారైన సమ్మోహనం ట్రయిలర్ బయటకు వచ్చింది. గతంలో ఒకటి రెండు సినిమాలు హీరోయిన్ తో ప్రేమలో పడడం అన్న సబ్జెక్ట్ ను డీల్ చేసాయి. Advertisement కానీ ఇంద్రగంటి…

ఇంద్రగంటి-సుధీర్ బాబు-అదితిరావ్ హైదరి కాంబినేషన్ లో తయారైన సమ్మోహనం ట్రయిలర్ బయటకు వచ్చింది. గతంలో ఒకటి రెండు సినిమాలు హీరోయిన్ తో ప్రేమలో పడడం అన్న సబ్జెక్ట్ ను డీల్ చేసాయి.

కానీ ఇంద్రగంటి ఈసారి తనదైన స్టయిల్ లో ఈ విషయాన్ని డీల్ చేసినట్లు కనిపిస్తోంది. సినిమాల మీద, సినిమా జనాల మీద సరైన అభిప్రాయాలు లేని వ్యక్తి, సినిమా హీరోయిన్ తో ప్రేమలో పడితే అన్న కాన్సెప్ట్ ట్రయిలర్ లో కనిపిస్తోంది.

సాధారణంగా ఎక్కువగా ఫన్ ను డీల్ చేసే ఇంద్రగంటి ఈసారి హ్యూమన్ ఎమోషన్లను కాస్త ఎక్కువే డీల్ చేసినట్లు కనిపిస్తోంది. ప్రేమావేశాలు, భావావేశాలు కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి ట్రయిలర్ లో.

టీజర్ లో ఫన్ ను కాస్త టచ్ చేసిన ఇంద్రగంటి ట్రయిలర్ లో తన మార్కు డైలాగ్ ఫన్ ను అస్సలు టచ్ చేయలేదు ఎందుకనో? కానీ అదే ట్రయిలర్ లో విజువల్స్ కొన్ని చూస్తుంటే సినిమాలో ఇంద్రగంటి మార్కు కామెడీ పుష్కలంగా వుండే అవకాశం వుందని కనిపిస్తోంది.

సినిమా మేకింగ్ క్వాలిటీ, ఖర్చు కూడా ట్రయిలర్ లో కనిపించేలా కట్ చేసారు. సుధీర్ బాబు కెరీర్ లో కాస్త ఎక్కువ ఖర్చు పెట్టిన సినిమా ఇదేనేమో?