నాగ్ సినిమాకు 400 థియేటర్లు

మొత్తంమీద ఆఫీసర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వందలకు పైగా థియేటర్లు సంపాదించగలిగారు. సినిమాను ఎక్కడా అమ్మలేకపోయినా, పంపిణీ పద్దతిలో ఇచ్చారు. పంపిణీ చేయడానికి ఏ సినిమాకైనా ప్రతి ఏరియాలోనూ జనాలు రెడీగా వుంటారు.…

మొత్తంమీద ఆఫీసర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వందలకు పైగా థియేటర్లు సంపాదించగలిగారు. సినిమాను ఎక్కడా అమ్మలేకపోయినా, పంపిణీ పద్దతిలో ఇచ్చారు. పంపిణీ చేయడానికి ఏ సినిమాకైనా ప్రతి ఏరియాలోనూ జనాలు రెడీగా వుంటారు. అందువల్ల సమస్య కాలేదు.

మొత్తంమీద నాలుగు వందల థియేటర్లలో ఆఫీసర్ విడుదలవుతోంది. దీనికి పోటీగా అభిమన్యుడు, రాజుగాడు విడుదలవుతున్నాయి. వాటిని మాత్రం ప్లాన్డ్ గా సెంటర్లను బట్టి థియేటర్లు, విడుదల ప్లాన్ చేసారు.

ఈ సినిమా మీద నాగ్ పెద్దగా హోప్స్ పెట్టకోలేదు కానీ, ప్రచారానికి మాత్రం లోటు చేయలేదు. ప్రెస్ మీట్ కు వచ్చాడు. వీలయినంత సేపు మాట్లాడారు. అంతకన్నా ఆయన ఏం చేయగలరు? సినిమాకు విడుదల చేసిన రెండు టీజర్లు, ట్రయిలర్ కు సరైన స్పందన రాలేదు. ఆ తరువాత సౌండ్స్.. సౌండ్స్ అంటూ ఏదో ప్రచారం చేసారు తప్ప, కంటెంట్ మీద కాదు.

అందుకే నాగ్ ఓన్ అన్నపూర్ణ టీమ్ ఈ సినిమా విషయంలో జోక్యం చేసుకోలేదని తెలుస్తోంది. థియేటర్లను కూడా వర్మ టీమ్ నే సెట్ చేసుకుందట. ఆఖరికి సినిమా పబ్లిసిటీ వ్యవహారంలో కూడా అన్నపూర్ణ యూనిట్ వేలు పెట్టలేదని తెలుస్తోంది.