శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలో కొంత సామాజిక స్పహ వున్న పాయింట్లు టచ్ చేసాడు మహేష్ బాబు. ఇవి క్లిక్ అయ్యాయి కూడా. రాబోయే వంశీ పైడిపల్లి సినిమాలో కూడా ఇదే తరహా వుంటుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో రైతు సమస్యలు టచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కృష్ణుడు-కుచేలుడు టైపు లైనుతో తయారవుతున్న ఈసినిమాలో ఆ రెండు పాత్రల్లో మహేష్ బాబు, అల్లరి నరేష్ కనిపిస్తారన్న సంగతి తెలిసిందే. అమెరికాలో, ఇండియాలో కథ నడుస్తుందని, ఇండియాలో కథ నడచినపుడు రైతు సమస్యలపై డిస్కషన్ వుంటుందని తెలుస్తోంది.
అయితే ఈకథ అంతా ఏడాది క్రితం రెడీ అయింది. ఇటీవల తెలంగాణలో రైతులకు అనుకూలంగా ప్రభుత్వం అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. అందువల్ల ఆ సమస్యలు వుంచారో, తీసారో? లేక వేరే విధంగా డీల్ చేసారో చూడాలి.
ఎందుకంటే ఇటు వంశీ పైడిపల్లి, అటు నిర్మాత దిల్ రాజు తెలంగాణకు చెందిన వారు కనుక, లేనిపోని ఇబ్బందులు వుంటాయని ఘాటు తగ్గించే అవకాశం కూడా లేకపోలేదు.