రౌతు బట్టి గుర్రం కానీ, మనకి అంతంత మాత్రం స్వారీ వస్తే, అరేబియా గుర్రాన్ని కంట్రోలు చేయడం సాధ్యంకాదు. పెద్ద టెక్నిషీయన్లను పెట్టేసుకోగానే సరికాదు. వాళ్లతో స్మూత్ గా పని చేయించుకోగలగాలి. లేదూ అంటే వాళ్లు ఓ ఆట ఆడించేస్తారు. ఆ మధ్య వచ్చిన ఓ బయోపిక్ కు మాంచి సినిమాటోగ్రఫీ వర్క్ సమకూరింది. అందరూ అద్భుత: అన్నారు.
దాంతో మంచి టెక్నీషియన్ అని మరో మీడియం సినిమాకు తీసుకున్నారు. అది కూడా కాస్త లేడీ ఓరియెంటెడ్ సినిమానే. కానీ వర్క్ స్టార్ట్ అయ్యాక తెలిసింది. ఆ పెద్దాయనతో పనిచేయడం అంటే వైట్ ఎలిఫెంట్ వ్యవహారం అని. ఇటీవల ఓ విదేశీ షెడ్యూలు చేస్తే అనుకున్నదాని కన్నా కోటి రూపాయలు ఎక్కువ అయిందట.
దాంతో ఆ సినిమా నిర్మాత బెంబేలెత్తిపోయినట్లు బోగట్టా. ఏదో పాపం ఇప్పుడిప్పుడే సినిమా నిర్మాణం స్టార్ట్ చేసి, కాలు, చేయి అన్నీ కూడా తీసుకుని, కిందామీదా పడుతున్న ఆ నిర్మాత తక్షణం సదరు సినిమాటోగ్రాఫర్ కు ఆ విదేశంలోనే దండం పెట్టేసాడట. 'నా బతుకుతో ఆడుకోవద్దు' అన్న రేంజ్ లో చెప్పేసి, దాదాపు కాళ్లు మొక్కినంత పనిచేసి, అర్జెంట్ గా వేరే సినిమాటోగ్రాఫర్ ను పెట్టుకున్నారట.
పెట్టుకునే ముందే ఆలోచించాలి. మన సినిమాకు ఈ లెవెల్ ఫొటోగ్రాఫర్ అవసరమా? కాదా? అన్నది. లేకపోతే ఇలాగే వుంటుంది. వ్యవహారం.