మొత్తానికి టెంపర్ తరువాత ఓ హిట్ కొట్టారు దర్శకుడు పూరి జగన్నాధ్. ఆ సినిమా కంటెంట్ ఏమిటో? ఆ హిట్ ఎలా వచ్చిందో మామూలు జనాల సంగతి ఎలా వున్నా సినిమా జనాలకు, హీరోలకు క్లియర్ గా తెలుసు. పైగా ఏ హీరో కూడా ఖాళీగాలేరు. వరుస లైనప్ లతో బిజీగా వున్నారు. ఇలాంటి టైమ్ లో ఇదిగో పూరి-అదిగో హీరో అంటూ తెగ ఫీలర్లు వదులుతున్నారు.
ముందుగా కన్నడ హీరో నిఖిల్ గౌడ్ అన్నారు. అది అయిపోయింది. మరో కన్నడ హీరో యశ్ తో సినిమా అన్నారు. వందల కోట్ల రేంజ్ సినిమాలు చేస్తున్న యశ్ పూరితో సినిమా చేస్తాడో? చేయడో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక లేటెస్ట్ పేరు విజయ్ దేవరకొండ. దారుణమైన డిజాస్టర్ చవి చూసాడు కాబట్టి, పూరితో సినిమా చేస్తాడేమో అన్న ఆలోచనలోంచి పుట్టి వుండొచ్చు ఈ గ్యాసిప్.
ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ విడుదలయ్యాక ఈ రోజు వరకు పూరి-విజయ్ ల మధ్య ఒక్క సిటింగ్ కూడా జరగలేదు. ఇది వాస్తవం. పైగా విజయ్ ఛేతిలో రెండు సినిమాలు వున్నాయి. అన్నింటికి మించి ఫ్లాపు వచ్చినా, రాకున్నా, మాంచి స్క్రిప్ట్ లేకుండా విజయ్ ఓకె చెప్పడు. పూరి చూస్తే, లైన్ తప్ప కథ చెప్పడు. అందువల్ల ఇద్దరికి మ్యాచ్ అన్నది అంత వీజీకాదు.
ఇవన్నీ ఇలావుంచితే, పూరి జగన్నాధ్ ప్రస్తుతం ఓ హిందీ సినిమా చేసే ఆలోచనలో వున్నారు. ఇది ఇప్పటి ఆలోచన కాదు. ఇస్మార్ట్ శంకర్ కు ముందు నుంచే ఆ ప్రయత్నం వుంది. ఈయన చెప్పిన లైన్ వగైరా అన్నీ ఓకె అయిపోయాయి. ఇస్మార్ట్ శంకర్ హడావుడి నుంచి బయటపడి, ముంబాయి వెళ్లి ఓకె చేయించుకుని రావాలి. తెలుగు సినిమా చేస్తే, మహా అయితే ఏడెనిమిది కోట్లకు మించిరావు మహా అయితే పదికోట్లు.
అదే బాలీవుడ్ సినిమా ప్యాకేజ్ ఓకె చేయించుకంటే దాని లెక్కే వేరు. ఇప్పుడు ఇదే పూరి ఆలోచనగా తెలుస్తోంది. ఓ హిందీ సినిమా తీసి, హిట్ కొట్టగలిగితే, అప్పుడు ఇక్కడ పెద్ద హీరోలు కూడా లైన్ లోకి వచ్చే అవకాశం వుంటుంది. అందుకే ఆ దిశగానే పూరి ప్రయత్నాలు స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.