Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కమెడియన్ కూతురు కొత్త వీడియో

కమెడియన్ కూతురు కొత్త వీడియో

కమెడియన్ ఎమ్ఎస్ నారాయణ ఇప్పుడు మన మధ్య లేకపోయినా, సినిమా అభిమానులు అంత సులువుగా మరచిపోరు. ఆయన కుమార్తె శశికిరణ్ కు కూడా స్క్రీన్ మీద ప్రూవ్ చేసుకోవాలని కోరిక. అయితే నటనలో కాదు. ఫిల్మ్ మేకింగ్ లో. తండ్రి బతికి వుండగానే టీవీ రంగంలో చాలా ప్రయోగాలు చేసిన శశికిరణ్, సరైన బ్రేక్ మాత్రం సాధించలేదు.

అందుకే ఇప్పుడు వెబ్ సీరీస్, కొత్తవాళ్లతో సినిమా లాంటి వాటిపై దృష్టి పెట్టారు. అందుకోసం పైలెట్ ఎపిసోడ్ అన్నట్లుగా ఇటీవల గర్ల్ ఇన్ ద సిటీ అనే పేరు మీద హైదరాబాద్ మీద ఓ వీడియో సాంగ్ ను తయారుచేసారు.

దాన్ని వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేసారు. ఇప్పటికే చాలా మంది యంగ్ స్టర్స్ మేకింగ్ లో చూపిస్తున్న స్టయిల్ నే ఆమె కూడా వీడియోలో చూపించారు. సినిమా లెవెల్ కు కాకున్నా, వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్ ల లెవెల్ కు సూటయ్యేలా ఉంది వీడియో.

ఇప్పుడు ఈవీడియో సాంగ్ కు తనకు చాన్స్ లు తెస్తుందని ఆశిస్తున్నారట శశికిరణ్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?