Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అవి నిజమైన ఫొటోలేనా మహర్షీ!

అవి నిజమైన ఫొటోలేనా మహర్షీ!

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మహర్షి సినిమాను ఎంత లేపడానికి ప్రయత్నిస్తున్నా, ఆ మూవీపై అంచనాలు దారుణంగా పడిపోతున్నాయి. యూనిట్ చేస్తున్న ప్రతి ప్రచారం రివర్స్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు ఈ సినిమాపై హైప్ ను అమాంతం తగ్గించేశాయి. ఇప్పుడు స్టిల్స్ కూడా అదే పని చేస్తున్నాయి. తాజాగా విడుదలైన 2 ఫొటోలు మహర్షి సినిమాపై ఇంకాస్త అంచనాల్ని తగ్గించాయి.

బ్యాక్ గ్రౌండ్ లో రైతులు, వాళ్ల ముందు మహేష్ దర్జాగా నడుస్తూ వస్తుంటాడు. రెండు రోజుల కిందట విడుదలైన మహర్షి స్టిల్ ఇది. ఇది చూసిన ప్రతి ఒక్కరు అసలిది మహర్షి సినిమాలోనిదేనా అని అనుమానించారు. అంతలా స్టిల్ ను మార్చిపడేశారు. చివరికి ఫొటోలో ఉన్నది కూడా మహేష్ బాబు కాదని, ఏదో మార్ఫింగ్ లా ఉందంటూ కామెంట్స్ పడుతున్నాయి.

తాజాగా విడుదలైన మరో ఫొటో ఈ కామెంట్స్ కు మరింత ఆజ్యం పోసింది. దుక్కి దున్నుతున్న మహేష్ ఫొటో ఇది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. అంతా బాగుంది కానీ అది సినిమా స్టిల్ లా అనిపించలేదు. ఇది కూడా మార్ఫింగ్ చేసినట్టే కనిపించడం బాధాకరం. ఈ రెండు ఫొటోల్లో మహేష్ నవ్వుతూ అందంగానే కనిపిస్తున్నాడు కానీ పిక్స్ లో జీవం కనిపించలేదు.

ఇలా మహర్షి సినిమాకు సంబంధించి యూనిట్ చేస్తున్న ప్రతి ప్రచారం బెడిసికొడుతోంది. ఈరోజు సాయంత్రం ఈ సినిమాకు సంబంధించి నాలుగో సింగిల్ విడుదల చేయబోతున్నారు. పదరా.. పదరా అనే లిరిక్స్ తో సాగే ఈ పాట.. గతంలో శ్రీమంతుడు సినిమాలో వచ్చిన జాగో జాగో టైపులో సూపర్ హిట్ అవుతుందనే అంచనాలున్నాయి. కనీసం ఈ పాట అయినా క్లిక్ అవుతుందేమో చూడాలి.

'ఎవరు గెలుస్తారు?' అనేది ప్రశ్నగానే మిగిలి ఉంది

కాంచన నుంచి పాఠాలు లారెన్స్ నేర్చుకున్నాడా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?