Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

డైలామా లో ఇంద్రగంటి

డైలామా లో ఇంద్రగంటి

నిర్మాత దిల్ రాజు దర్శకుడు ఇంద్రగంటికి క్లారిటీ ఇచ్చేసారు. భారీ సినిమా చేసే ఆలోచన లేదు, అందువల్ల అలాంటి కథ పక్కన పెట్టి, ఓ మాంచి క్యూట్ లవ్ స్టోరీ వుంటే చెప్పండి, చేద్దాం అని. ఎందుకంటే వి సినిమా తరువాత ఇంద్రగంటి డైరక్షన్లో దిల్ రాజు ఓ మిడ్ రేంజ్ హీరోతో సినిమా చేయాల్సి వుంది. దానికి అరవై డెభై కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. కానీ వి ఫలితం చూసాక, ఆ కాంబినేషన్ కు అంత వర్కవుట్ అవుతుందా అన్న అనుమానం కలిగింది. ప్రాజెక్టు పక్కన పెట్టారు.

ఇదిలా వుంటే ఇంద్రగంటి కి మరో ఆప్షన్ వుంది. అది నాగ్ చైతన్య సినిమా. ఈ మేరకు కరోనా కు ముందే ఓ లైన్ చెప్పారు. అమెరికా బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ అది. దాంతో ఆ కథను అలా వుంచి మరేదైనా కథ చెప్పమని చైతన్య ఇంద్రగంటికి చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో ఇంద్రగంటి అలా వుండిపోవాల్సి వచ్చింది. చైతన్య ఏదో ఒక విషయం చెబితే ఇంద్రగంటి ముందుకు వెళ్లడానికి అవుతుంది.

అటు దిల్ రాజు కథ మార్చమని, ఇటు చైతన్య కథ మార్చమని అంటే ఇంద్రగంటికి కష్టమే. ఈ ఇద్దరికీ రెండు కథలు సెట్ చేసి ముందుకు వెళ్లాలో, లేదా మరో మాంచి కథ చూసుకుని చిన్న సినిమా తీసి హిట్ కొట్టి తనేంటో మళ్లీ ప్రూవ్ చేసుకోవాలో?

నా ఆరోప్రాణం వెళ్ళిపోయింది..కె విశ్వనాధ్

పవన్ ఇంటర్వ్యూ.. పరస్పర సహకార ఒప్పందం 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?