దానయ్య కొడుకు బ్యాడ్ లక్!

మనం సినిమా చేద్దాం అనుకున్న దర్శకుడు ముందుగా ఓ పెద్ద హిట్ కొడితే అది ప్లస్ అనుకుంటారు అంతా. కానీ నిర్మాత దానయ్య కొడుకు కళ్యాణ్ విషయంలో అది బ్యాడ్ లక్ గా మారుతోంది. …

మనం సినిమా చేద్దాం అనుకున్న దర్శకుడు ముందుగా ఓ పెద్ద హిట్ కొడితే అది ప్లస్ అనుకుంటారు అంతా. కానీ నిర్మాత దానయ్య కొడుకు కళ్యాణ్ విషయంలో అది బ్యాడ్ లక్ గా మారుతోంది. 

దానయ్య కొడుకు కళ్యాణ్ హీరోగా మారాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. చాలా మంది డైరక్టర్లను ట్రయ్ చేసారు. సబ్జెక్ట్ లు విన్నారు. సెట్ కాలేదు. దర్శకుడు మారుతికి అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసారు దానయ్య. అలాంటి టైమ్ లో ప్రతి రోజు పండగే అంటూ పెద్ద హిట్ పడింది మారుతికి. దాంతో దానయ్య ఒక పెద్ద హీరోను తెచ్చి మారుతి కాంబినేషన్ వాడదాం అనుకున్నారు. ఆ ప్రయత్నం అలా వీగిపోయింది.

ఆ తరువాత చాన్స్ ప్రశాంత్ వర్మ మీదకు వెళ్లింది. ప్రశాంత్ వర్మ తన సూపర్ హీరో సిరీస్ లో మూడో సినిమా అధీరను కళ్యాణ్ హీరోగా ప్రకటించారు. ఈ లోగా హనుమాన్ అనే సినిమాను చిన్న సినిమాగా ప్రారంభించారు. మీడియం సినిమాగా నిర్మించారు. కానీ ఇప్పుడు ఆ సినిమా నిర్మాతకు 50 కోట్లకు పైగా లాభాలు ఆర్జించిపెడుతోంది. ప్రశాంత్ వర్మ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతోంది.

దాంతో ఇప్పుడు ప్రశాంత్ వర్మ తన తరువాత సినిమాను ఓ లెవెల్ లో చేయాలనుకుంటున్నారు. అందుకోసం ముందుగా ఒప్పుకున్న అధీర సినిమాను తన అసిస్టెంట్ ఎవరికైనా అప్పగించాలని భావిస్తున్నారు. కళ్యాణ్‌కు ఆ విధంగా మళ్లీ దర్శకుడు మారే పరిస్థితి.

నిజానికి నిర్మాత దానయ్య తన కొడుకు కెరీర్ విషయంలో సీరియస్‌గా వున్నట్లు లేదు. ఆయనే కనుక సీరియస్ గా వుంటే ఈ పాటికి ఒకటికి రెండు సినిమాలు అయిపోయి వుండేవి.