అలిగిన అయ్యన్న పాత్రుడు?

వైకాపాలో అలకలు, పార్టీ మార్పిడులు చూసి తేదేపా జనాలు, సోషల్ మీడియా హ్యాండిల్స్ మహా సంబరపడుతూ వుండొచ్చు. కానీ టికెట్ లు ఇవ్వడం అనేది ఒకసారి ప్రారంభిస్తే ఏ పార్టీకైనా ఇదే పరిస్థితి.  Advertisement…

వైకాపాలో అలకలు, పార్టీ మార్పిడులు చూసి తేదేపా జనాలు, సోషల్ మీడియా హ్యాండిల్స్ మహా సంబరపడుతూ వుండొచ్చు. కానీ టికెట్ లు ఇవ్వడం అనేది ఒకసారి ప్రారంభిస్తే ఏ పార్టీకైనా ఇదే పరిస్థితి. 

వైకాపా అధినేత జగన్ తెలివిగా ముందే ఈ కార్యక్రమం పెట్టుకున్నారు. ఇక్కడ బాబు గారి తెలివి కూడా వుంది. వైకాపా బుకింగ్ క్లోజ్ అయ్యాక తమ బుకింగ్ ఓపెన్ చేస్తే, ఇక జనాలు పక్క పార్టీ కేసి చూసే అవకాశం వుండదు అన్నది బాబు గారి ఐడియా. కానీ జగన్ టికెట్‌లు ఇస్తున్నట్లు చెప్పడం లేదు. పార్టీ ఇన్ చార్జ్‌లుగా నియమిస్తున్నారు. అంటే ఇంకా ఓ తలుపు తెరిచే వుంది.

సరే, ఆ సంగతి అలా వుంచితే తేదేపాలో అంతర్గతంగా టికెట్‌ల డిస్కషన్ స్టార్ట్ అయింది. దాంతో అక్కడ కూడా లుకలుకలు ప్రారంభమవుతున్నాయి. తేదేపా ఫైర్ బ్రాండ్ అయ్యన్న పాత్రుడు అలిగినట్లు తెలుస్తోంది. తనకు నర్సీపట్నం ఎమ్మెల్యే టికెట్‌ను, తన కొడుకు కు అనకాపల్లి ఎంపీ టికెట్ ను ఇవ్వాలని అయ్యన్న కోరుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయంలో అయ్యన్నకు బద్ద శతృవైన గంటా శ్రీనివాసరావు వేరే విధంగా పావులు కదిపినట్లు తెలుస్తోంది.

ఓ ఎన్నారై ను పార్టీలోకి తీసుకువచ్చి ఎంపీగా పోటీ చేయించేలా, లేదూ అంటే కొణతాల రామకృష్ణను జనసేనలోకి పంపి, ఎంపీగా పోటీ చేయించేలా గంటా పావులు కదిపినట్లు రాజకీయ వర్గాల బోగట్టా. దీంతో అయ్యన్న అలిగి ప్రస్తుతం పార్టీ జనాల ఫోన్ కు సమాధానం ఇవ్వడం లేదని తెలుస్తోంది. లోకేష్ మాత్రం బెట్టుగా వుండగా, చంద్రబాబు మాత్రం అయ్యన్నను బుజ్జగించాలని ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.