టాలీవుడ్ లో నిర్మాణమవుతున్న అతి భారీ సినిమా అది. ఎప్పుడు మొదలైందో.. కానీ, ఎప్పుడు వస్తుందో అన్నది క్లారిటీ లేదు. ఈ సినిమాకు కర్ణుడికి వున్నన్ని కష్టాలు వున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే దర్శకుడిని తిట్టని తిట్లు లేవు. ట్రోలింగ్ ఓ రేంజ్ లో.
ఎందుకంటే సినిమా ఆలస్యానికి కారణం దర్శకుడే అని గట్టిగా నమ్మడంతో. కానీ విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఈ సినిమా ఇలా నత్తనడక నవడానికి దర్శకుడు ఎంత వరకు కారణమో, హీరో కూడా అంతే కారణమని తెలుస్తోంది.
అయితే హీరో కనుక యూనిట్ ఎవ్వరూ పెదవి వివ్పడం లేదు. నిర్మాత పళ్ల బిగువున భరిస్తున్నారు. విషయం బయటకు రావడం లేదు. కానీ తెలుస్తున్న సమాచారం ఏమిటంటే దర్శకుడి వల్ల షెడ్యూలు చేయడం ఆలస్యం అవుతోంది కానీ హీరో వల్ల క్యాన్సిలేషన్లు ఎక్కువ వున్నాయని తెలుస్తోంది.
ఈ మధ్యనే సిటీలో ఓ పది రోజులు షెడ్యూలు చేస్తే మూడు రోజుల పాటు హీరో డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. గత ఏడాది నుంచి ఇదిగో అదిగో అంటూ వినిపిస్తున్న ఈ సినిమా విడుదల లెేటెస్ట్ డేట్ సెప్టెంబర్.. అక్టోబర్. కానీ ఈ పరిస్థితి చూస్తుంటే డిసెంబర్ కు వెళ్లినా ఆశ్చర్యం లేదు.