టీడీపీ- జనసేన పొత్తుల సీట్ల సర్దుబాటు తర్వాత తాడేపల్లిలో ఏర్పాటు చేసిన జెండా కార్యక్రమంలో ఇరువురు పార్టీ అధినేతలు కార్యకర్తలకు దిశానిర్ధేశం ఇవ్వడంతో పాటు.. అధికారంలోకి వస్తే ప్రజలకు చేసే పనుల గురించి చెప్పకుండా సభ మొత్తం జగన్‌పై వ్యక్తిగతంగా దాడి చేశారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి టీడీపీ దాని అనుకుల మీడియాలో వచ్చేవే చంద్రబాబు మాట్లాడితే.. పవన్ ఏ సభలో అయిన జగన్‌పై మాట్లాడే మాటలనే మళ్లీ మాట్లాడి కార్యక్రమాన్ని ముగించారు.
పవన్ కంటే ముందుగా మాట్లాడిన చంద్రబాబు.. జగన్ పాలన అట్టర్ ప్లాప్ సినిమా అయిందని తమ పొత్తు సూపర్ హిట్ అయిందంటూ చెప్పకొచ్చారు. అలాగే తమ కులం వారిని, సినిమా పేరుతో రాజమౌళి, చిరంజీవిని జగన్ అవమానించారని బాధపడ్డారు. తన వద్ద ఏపీని ఎలా అభివృద్ధి చేయాలో బ్లూప్రింట్ ఉందని చెప్పిన ఆయన ఆ ప్లాన్ గురించి మాత్రం చెప్పకుండానే సభ ముగించారు. అలాగే కుప్పంలో లక్ష మోజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
చివరిలో మాట్లాడిన జనసేన పవన్ కళ్యాణ్ మాత్రం సీఎం జగన్‌పై ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపాన్ని మొత్తం వెళ్లగక్కారు. పనిలో పనిగా జనసైనికులకు, కాపు నేతలకు వార్నింగ్ ఇచ్చారు. తనకు సలహాలు ఇవ్వకండి అని తన మాట వినని వారు తన వారు కాదన్నారు. 24 సీట్లు తీసుకోవడం వెనుక పెద్ద వ్యూహం ఉందంటూ చెప్పుకొచ్చారు. తన అభిమానులు తనను కాదని జగన్‌కు ఓటు వేశారని.. రెండు చోట్లా ఓడిపోయిన బాధ మీకు తెలుసా అంటూ జనసైనికులను ప్రశ్నించారు. చంద్రబాబు లాంటి గొప్ప నాయకుడు రాష్ట్రానికి అవసరం అని వచ్చే ఎన్నికల్లో తమ కూటమిని గెలిపించాలని కోరారు.
ఈ సభలో అయిన పవన్ నిలబడే స్థానం పాటు బీజేపీ పొత్తుపై క్లారిటీ ఇస్తారనే ఆశతో ఎదురు చూసిన జనసైనికులకు తీవ్ర నిరాశనే మిగిలింది.