ఇది అందరికీ నచ్చే ‘ఆపరేషన్’

హీరో వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సిద్దు ముద్దా నిర్మించారు. నందకుమార్ అబ్బినేని సహ నిర్మాత.…

హీరో వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సిద్దు ముద్దా నిర్మించారు. నందకుమార్ అబ్బినేని సహ నిర్మాత. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపధ్యంలో నిర్మాతలు సిద్దు ముద్దా, నందకుమార్ అబ్బినేని విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ చేసిన షార్ట్ ఫిల్మ్ మాకు, వరుణ్ కి చాలా నచ్చింది. దాన్నే ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్ గా చేయాలనే ప్రయత్నాల్లో దర్శకుడు వున్నప్పుడు, మేము, వరుణ్ కలసి కథ విన్నాం. కథ విన్న వెంటనే మాకు చాలా నచ్చింది. వెంటనే సినిమా చేయాలని అనుకున్నాం. సోనీ పిక్చర్స్ నిర్మాణ భాగస్వామిగా రావడంతో తెలుగు, హిందీలో చాలా గ్రాండ్ రూపొందించాం.

దర్శకుడు శక్తి ప్రతాప్ కి చాలా క్లారిటీ వుంది. తన విజన్ క్లియర్ గా వుంటుంది, సినిమాకి ఏం కావాలో తనకి చాలా స్పష్టంగా తెలుసు. ఫైటర్ తర్వాత ఇలాంటి భారీ ఎయిర్ సీక్వెన్స్ తో ఇండియాలో వచ్చిన సినిమా ఇదే. సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. సినిమా చాలా గ్రాండ్ గా వచ్చింది. గ్వాలియర్ ఎయిర్ బేస్ లో సినిమాని షూట్ చేశాం. అందుకే విజువల్స్ అంత నేచురల్ గా ఎఫెక్టివ్ గా వచ్చాయి.

ఎయిర్ ఫోర్స్ అధికారులు సినిమా చూసిన తర్వాత చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏం చెప్పారో అదే తీశారని ప్రశంసించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా వారు చాలా సపోర్ట్ చేశారు. రియల్ ఎయిర్ బేస్ లో షూట్ చేయడం ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. సైనికులు త్యాగాలని, ధైర్య సాహసాలని స్మరించుకుంటూ వాళ్ళ కథని ప్రేక్షకులకు చూపించాలనే గొప్ప ఉద్దేశంతో ఈ సినిమా చేశాం. 'ఆపరేషన్ వాలెంటైన్' చేస్తున్న క్రమంలో ఇలాంటి రియల్ హీరోస్ సినిమాలు మరిన్ని చేయాలనే స్ఫూర్తి కలిగింది. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది.

బాలీవుడ్ లో బాగా ప్రమోషన్స్ జరిగాయి. వరుణ్ తేజ్ అక్కడ చాలా ఇంటర్వ్యూస్ లో పాల్గొన్నారు. అక్కడ చాలా మంచి రెస్పాన్స్ వుంది. ప్రిమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. మిక్కీ జే మేయర్ ఎక్స్ ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ద్రుష్టిలో పెట్టుకొని తెలుగు ఫ్లేవర్ మిస్ కాకుండా మ్యూజిక్ ఇచ్చారు. పాటలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. ఇప్పటికే పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా వుంటుంది.