దర్శకుడి తెలివే తెలివి!

ఎదుటివాడు మనల్ని కార్నర్ చేసే బదులు, మనవే అవతలివాడిని కార్నర్ చేస్తే.. వ్యవహారం సైలంట్ అయిపోతుంది కదా? ఇలాగే అనుకుంటున్నారేమో? తెలివి తేటలు పుష్కలంగా వున్న ఆ దర్శకుడు. ఆ దర్శకుడు చిరకాలంగా ఒక…

ఎదుటివాడు మనల్ని కార్నర్ చేసే బదులు, మనవే అవతలివాడిని కార్నర్ చేస్తే.. వ్యవహారం సైలంట్ అయిపోతుంది కదా? ఇలాగే అనుకుంటున్నారేమో? తెలివి తేటలు పుష్కలంగా వున్న ఆ దర్శకుడు. ఆ దర్శకుడు చిరకాలంగా ఒక నిర్మాతతో కలిసి ప్రయాణం చేస్తున్నారు.

ఇప్పుడు నిర్మించిన ఓ సినిమాకు దర్శకుడు బాగా బ్యాడ్ అయ్యారు. నిర్మాతకు పదుల కోట్లలో మిగులుతుంది అనుకుంటే చేతికి తగిలే మారింది ప్రాజెక్ట్. తప్పులు అన్నీ ఆయన వైపే వున్నట్లు అందరి వేళ్లూ అటే చూపించాయి. అన్ని నోళ్లూ అదే వంత పాడాయి. ఇలాంటపుడు సహజంగానే నిర్మాత ఇవ్వాళో, రేపో లెక్కలు తీయడం, దర్శకుడిని కార్నర్ చేయడం కామన్ కదా?

అందుకే దర్శకుడు తెలివైన ఎత్తుగడ వేసినట్లు కనిపిస్తోంది. పరిచయం వున్న నిర్మాతలను ఒకరిద్దరిని పిలిచి ముచ్చట్లు పెట్టడం మొదలుపెట్టారు. అంతే కాకుండా తను వేరే నిర్మాతతో కలిసి సినిమా చేస్తారనే గ్యాసిప్ లను బయటకు వెళ్లేలా చేసారు. గమ్మత్తేమిటంటే గతంలో కూడా సేమ్ టు సేమ్ స్కీమ్ అమలు చేసారు.

తను స్వంత బ్యానర్ పెట్టబోతున్నట్లు గ్యాసిప్ లు బయటకు వెళ్లేలా చేసారు. దీంతో అదేదో ఇక్కడే పెట్టుకోండి. పావలా వాటా తీసుకోండి అంటూ ఆఫర్ వచ్చేసింది. ఇప్పుడు కూడా పాత నిర్మాత ఇక సైలంట్ అయిపోతారు కదా. గట్టిగా లెక్కలు మాట్లాడితే బయటకు వెళ్లిపోతారేమో అన్న చిన్న కంగారు వుంటుంది కదా.

అదీ తెలివితేటలతో అమలు చేస్తున్న స్కీమ్ తప్ప, బయటకు వెళ్లేది లేదు. సినిమా చేసేది లేదు అని తెలుస్తోంది. ఈ తెలివితేటలు అన్నీ సినిమా మేకింగ్ లో చూపిస్తే అన్నీ బ్లాక్ బస్టర్లే వస్తాయేమో? అదీ టాలీవుడ్ లో వినిపిస్తున్న కామెంట్.