దసరా బుకింగ్ లు మొదలు

దసరా సీజన్ కోసం ఇప్పటి నుంచే థియేటర్ల రిజర్వేషన్ మొదలయిపోయింది. మూడు నాలుగు సినిమాలు ఈ సారి దసరా సీజన్ కు వచ్చేలా కనిపిస్తున్నాయి. అందువల్ల ఇప్పటి నుంచే ముందు జాగ్రత్త మొదలైపోయింది. దసరా…

దసరా సీజన్ కోసం ఇప్పటి నుంచే థియేటర్ల రిజర్వేషన్ మొదలయిపోయింది. మూడు నాలుగు సినిమాలు ఈ సారి దసరా సీజన్ కు వచ్చేలా కనిపిస్తున్నాయి. అందువల్ల ఇప్పటి నుంచే ముందు జాగ్రత్త మొదలైపోయింది. దసరా ముందువారం త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా అరవింద సమేత విడుదలవుతోంది. ఇది భారీ సినిమా, భారీ విడుదల. వెయ్యికి పైగా స్క్రీన్ లు అవసరం పడతాయి.

ఇక దిల్ రాజు తను రామ్ తో నక్కిన త్రినాధరావు డైరక్షన్ లో నిర్మిస్తున్న హలో గురూ ప్రేమకోసమే సినిమా సరిగ్గా దసరాకు విడుదలవుతోంది. ఎన్టీఆర్ సినిమాకు, దీనికి ఒక్కవారమే గ్యాప్. అందువల్ల అరవిందకు ఓ వారం కోసం ఇచ్చినా, కనీసం అయిదారు వందల స్క్రీన్ లు దీనికి రిజర్వ్ చేయాలి.

విశాల్ పందెం కోడి-2 సినిమా కూడా సరిగ్గా దసరా టైమ్ కే విడుదలవుతోంది. అది కూడా శాటిలైట్ తో కలిపి 10కోట్ల సినిమా. డబ్బింగ్ రేట్లు చూసుకుంటే ఎక్కువే. అందువల్ల దాన్ని కూడా కనీసం 400కు పైగా స్క్రీన్ లు వేయకుంటే కిట్టుబాటు కాదు.

ఈ సినిమాలకు ముందు వెనుకలుగా కూడా మరి కొన్ని సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాయి. అందుకే ఇప్పటి నుంచే థియేటర్ల సర్దుబాటు, అగ్రిమెంట్ లు మొదలయిపొయాయట.