విజేత సక్సెస్ మీట్ కు బన్నీ

మెగా హీరోలు కదులుతున్నారు. తమ ఫ్యామిలీ నుంచి వచ్చిన కొత్త హీరో కళ్యాణ్ దేవ్ ను నిలబెట్టేందుకు నడుం బిగిస్తున్నారు. సినిమా విడుదలయిన మర్నాడు హీరో చిరంజీవి మీడియా ముందుకు వచ్చి, సినిమా మంచి…

మెగా హీరోలు కదులుతున్నారు. తమ ఫ్యామిలీ నుంచి వచ్చిన కొత్త హీరో కళ్యాణ్ దేవ్ ను నిలబెట్టేందుకు నడుం బిగిస్తున్నారు. సినిమా విడుదలయిన మర్నాడు హీరో చిరంజీవి మీడియా ముందుకు వచ్చి, సినిమా మంచి చెడ్డలు మాట్లాడారు. ఇప్పుడు స్టయిలిష్ స్టార్ బన్నీ వస్తున్నారు.

విజేత సక్సెస్ మీట్ పేరిట ఆదివారం సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఈ మీట్ కు బన్నీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. విజేత తొలి రోజు కలెక్షన్లు కాస్త డల్ గా వున్నా, శని, ఆదివారాలు కాస్త పికప్ అయ్యాయి. మరీ ఫస్ట్ వీకెండ్ కు తగినట్లు కాదు కానీ, కాస్త ఆశలు కలిగించాయి. అందువల్ల పబ్లిసిటీ బాగా చేస్తే,ఉపయోగం వుంటుందని భావిస్తున్నారు.

ఇప్పటికే చిన్నసక్సెస్ టూర్ నిర్వహించారు. అలాగే సక్సెస్ మీట్ పెడుతున్నారు. ఉపాసన సోషల్ మీడియాలో సినిమా గురించి పాజిటివ్ కామెంట్స్ చేసారు. మిగిలిన హీరోలు కూడా పబ్లిసిటీలో పాలు పంచుకుంటారేమో చూడాలి.