ప్రభాస్ నటిస్తున్న భారీ సినిమా సాహో. మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ సినిమా సైరా. ఈ రెండు సినిమాలు 2019 విడుదల టార్గెట్ గా రూపొందుతున్నాయి. ఈ రెండు సినిమాలు ఒకే విధంగా ప్లానింగ్ చేసుకుని ముందుకు వెళ్తుండడం విశేషం.
సాహో సినిమాలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ ను ముందుగా ప్లాన్ చేసుకుంది. ఆ మేరకు అన్నీ పూర్తి చేసుకున్నాక, ఇప్పుడు లోకల్ షెడ్యూలు స్టార్ట్ చేసింది. అన్నపూర్ణ స్టూడియోలో రెగ్యులర్ సీన్లు, హీరో లేని కొన్నిసీన్లు చిత్రీకరిస్తున్నారు. దీనికి కొనసాగింపుగా మిగిలిన టాకీ షూట్ చేస్తారు. ఇప్పటిదాకా చేసిన యాక్షన్ సీన్లు అన్నీ సిజి వర్క్ కోసం అప్పగించేసారు.
సైరా సినిమా ప్లానింగ్ కూడా అలాగే వుంది. బ్రిటిష్ వారితో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి, ఆయన సైన్యం పోరాడే సీన్లను అన్నింటినీ ముందుగా చిత్రీకరించేసారు. వాటన్నింటినీ సిజి వర్క్ కు అప్పగించేసారు. ఇప్పుడు రెగ్యులర్ సీన్లు చిత్రీకరించడానికి ఏర్పాట్లుచేస్తున్నారు.
ఈ రోజుల్లో సిజి వర్క్ అన్నది కీలకం అయిపోయింది. అది పూర్తయితే తప్ప, సినిమా విడుదల డేట్ పక్కాకావడం లేదు. అందుకోసం ముందుగా సిజి అవసరం వున్న షాట్ లు అన్నీ తీసేసి, మామూలు టాకీ అంతా ఆ తరువాత ప్లాన్ చేయడం అలవాటు చేసుకుంటున్నారు.
సైరా, సాహో రెండూ కూడా బాలీవుడ్ మార్కెట్ ను కూడా దృష్టిలో పెట్టుకునే స్టార్ కాస్ట్, టెక్నీకల్ టీమ్ ను సెట్ చేసుకోవడం విశేషం.ఈ రెండూ కూడా మూడు వందలకోట్ల మార్కెట్ ను టార్గెట్ గా పెట్టుకున్నాయి.