హీరోయిన్లకు తొలి సినిమా అంటే పెద్దగా పారితోషికం వుండదు. అయితే నార్త్ లో ఒకటో రెండో సినిమాలు చేసి, సీరియళ్లలో చేస్తున్నవారు తెలుగులోకి వస్తే కాస్తయినా రెమ్యూనిరేషన్ ఇవ్వక తప్పదు. అయితే సినిమాలో అమ్మాయి పాత్ర కీలకం అయినపుడు, పైగా లిప్ లాక్ లు, టాప్ లు విప్పడాలు, రెచ్చిపోయి నటించడాలు వంటి సీన్లు వుంటే ఎంతయినా డిమాండ్ చేస్తారు.
ఆర్ఎక్స్ 100 సినిమాలో కొత్త హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఏ రేంజ్ లో నటించిందో తెలిసిందేగా. రెండు మూడు లిప్ లాక్ లు, ఓ లిప్ లాక్ సీన్ అయితే ఏకంగా రెండు నిమషాల లెంగ్తీ. అది కూడా పెదాలు జుర్రేసుకోవడం. ఇన్ని సీన్లు చేసినా, పాయిల్ రాజ్ పుత్ రెమ్యూనిరేషన్ జస్ట్ ఆరు లక్షలేనట.
వాస్తవానికి ఆర్ ఎక్స్ 100 కు హీరోయిన్ ఎంతకీ దొరకలేదు. ఎవరు వచ్చినా, సీన్లు, లిప్ లాక్ లు చెప్పేసరికి, నో అని వెళ్లిపోయారట. ఇక హీరోయిన్ లేని సీన్లతో షూట్ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైమ్ లో పాయిల్ రాజ్ పుత్ రిఫరెన్స్ వచ్చిందట. కథ, సీన్లు, సంగతులు చెప్పగానే సరే అనేసి ఓకె చేసేసి, రంగంలోకి దిగిపోయింది.
ఆర్ ఎక్స్ 100 ఇప్పుడు అంతలా ఊపేయడానికి ఆ అమ్మాయే కారణం అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
తెలుగులో ఇప్పుడే కాదట
ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారి ఇండస్ట్రీ జనాల చూపులను తన వైపు తిప్పుకుంది పాయల్ రాజ్ పుత్. అయితే మరీ టాప్ హీరోల పక్కన కాకపోయినా, మిడ్ రేంజ్ హీరోలు అందరికీ పనికి వచ్చే అవకాశం క్లియర్ గా వుంది. అసలే హీరోయిన్ల కొరత పట్టిపీడిస్తోంది టాలీవుడ్ ను.
అందుకే సినిమా ట్రయిలర్ విడుదల తరువాత కొంత వరకు, సినిమా విడుదల తరువాత మరింత ఎంక్వయిరీలు ప్రారంభమయ్యాయి.
అయితే ప్రస్తుతం నార్త్ లోని రీజనల్ లాంగ్వేజెస్ లో ఆ అమ్మాయికి రెండు మూడు కమిట్ మెంట్ లు వున్నాయట. వాటని ఫినిష్ చేసుకున్నాకే తెలుగు సినిమాలు ఓకె చేస్తుందట. ఆ తరువాత అవకాశాలు వున్నన్నాళ్లు ఇక్కడే చేస్తుందట.