దసరా సినిమాలకు సమస్యల ముసురు

దసరాకు చాలా సినిమాలు విడుదలను షెడ్యూల్ చేసుకున్నాయి. మిగిలినవి ఎలా వున్నా కీలకమైన సినిమాలు రెండు..రామ్ చరణ్..బ్రూస్ లీ, అఖిల్ తొలి సినిమా అఖిల్. ఈ రెండు సినిమాలు వరుసగా అక్టోబర్ 15, 21…

దసరాకు చాలా సినిమాలు విడుదలను షెడ్యూల్ చేసుకున్నాయి. మిగిలినవి ఎలా వున్నా కీలకమైన సినిమాలు రెండు..రామ్ చరణ్..బ్రూస్ లీ, అఖిల్ తొలి సినిమా అఖిల్. ఈ రెండు సినిమాలు వరుసగా అక్టోబర్ 15, 21 తేదీలకు షెడ్యూల్ అయ్యాయ్. అయితే ఇప్పుడు ఆ డేట్లకు వస్తాయా అన్నది అనుమానంగా వుంది.

రామ్ చరణ్ సినిమాలో చిన్న పాత్ర పోషిస్తున్నారు. దానికి ఓ పాట, ఫైట్ వుంది. అవి ఇంకా చిత్రీకరించాలి. ఈ సినిమా విడుదలకు గట్టిగా పాతిక రోజులే సమయం వుంది. ఈ సినిమా రీరికార్డింగ్ కు కాస్త సమయం కావాలని అడుగుతున్నాడట థమన్.  క్వాలిటీ అవుట్ పుట్ కోసం కాస్త ఎక్కువ సమయం అవసరం అంటున్నాడని వినికిడి. మరి రీరికార్డింగ్, డబ్బింగ్, అన్నీ పాతిక రోజుల్లో కానిచ్చేయాల్సి వుంది.

ఇక అఖిల్ సినిమా ఇంకా రీరికార్డింగ్ ప్రారంభం కాలేదు. టాకీ కానివ్వండి, పాటలు ఇంకా కొద్ది రోజుల సమయం వుంది. ఈ సినిమాకు రీరికార్డింగ్ ఇంకా కీలకం అంటున్నారు. అందుకే మణిశర్మను తెచ్చుకున్నారు. ఆయన కనీసం నెలన్నర పడుతుంది అంటున్నారట. గ్రాఫిక్స్, ఫాంటసీ ఎక్కువగా వున్నందనున కనీసం నెల రోజుల ముందు అయినా తనకు అప్పగిస్తే, ఆర్ ఆర్ బాగా వస్తుంది అంటున్నారట. మరి వున్న టైమ్  నెలే వుంది. ఇంకా డబ్బింగ్, ఇతరత్రా వ్యవహారాలు వుండనే వున్నాయి.

మరి ఈ రెండు సినిమాలు ఎంత స్పీడ్ గా రెడీ అవుతాయో చూడాలి.