కత్తి సమస్యలు తీరుతున్నాయా?

ఎప్పుడు కొన్నాడో కత్తి సినిమా హక్కులు ఠాగోర్ మధు. అప్పటి నుంచి అదిగో డబ్బింగ్, ఇదిగో రీమేక్ అంటూ ముందు వెనుక ఆడుతోంది. ప్రతి హీరో కత్తిని చేతిలోకి తీసుకోవడం, ఆ మేరకు వార్తలు…

ఎప్పుడు కొన్నాడో కత్తి సినిమా హక్కులు ఠాగోర్ మధు. అప్పటి నుంచి అదిగో డబ్బింగ్, ఇదిగో రీమేక్ అంటూ ముందు వెనుక ఆడుతోంది. ప్రతి హీరో కత్తిని చేతిలోకి తీసుకోవడం, ఆ మేరకు వార్తలు వినరావడం, అంతలోనే కత్తి కాస్తా చేతులు మారడం మామూలైపోయింది. 

కొద్ది రోజుల క్రితం కత్తి వ్యవహారం మెగాస్టార్  చిరంజీవి వరకు వచ్చి ఆగిపోయింది. ఈలోగా 60 వ బర్త్ డే వచ్చింది వెళ్లింది. ఆ లోగా కత్తి చేద్దామంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయని అన్నారు. అవేమిటో తెలియదు. హీరో  విజయ్ కత్తి రీమేక్ కు ఒకె అనడం లేదన్నదే బయటకు వచ్చిన విషయం. 

లేటెస్ట్ బజ్ ఏమిటంటే, కత్తి సమస్యలు తీరాయని, రీమేక్ కు ఓకె అయిందని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కత్తి రీమేక్ కచ్చితంగా చేస్తారని వార్తలు వినవస్తున్నాయి.  కత్తి సినిమా రీమేక్ ఎలాగైనా చిరుతో చేయాలని పట్టుదలగా వున్న ఠాగోర్ మధు, దాని అడ్డంకులను తొలగించడంలో సక్సేస్ అయ్యాడని వినికిడి. మరి ఆ శుభవార్త అఫిషియల్ గా ఎప్పుడు బయటకు వస్తుందో?