సుశాంత్ సినిమాలకు ఏమయింది?

సుశాంత్..నాగ్ మేనల్లుడు..స్వంత బ్యానర్ పై సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. అలాంటిది ఒక్కసారిగా హ్యాండ్ బ్రేక్ పడిపోయింది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తరువాత ఆ సినిమా డైరక్టర్ మేర్లపాక గాంధీ తో సుశాంత్ సినిమా చేస్తాడని…

సుశాంత్..నాగ్ మేనల్లుడు..స్వంత బ్యానర్ పై సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. అలాంటిది ఒక్కసారిగా హ్యాండ్ బ్రేక్ పడిపోయింది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తరువాత ఆ సినిమా డైరక్టర్ మేర్లపాక గాంధీ తో సుశాంత్ సినిమా చేస్తాడని వినిపించింది. చాన్నాళ్లు స్క్రిప్ట్ వగైరా కార్యక్రమాలు జరిగాయి. కానీ వున్నట్లుంది మేర్లపాక వేరే ప్రాజెక్టు పైకి వెళ్లిపోయాడు. 

ఆ మధ్య డైరక్టర్ నాగేశ్వర రెడ్డి పేరు వినిపించింది. నాగేశ్వర రెడ్డి ఏ మేరకు వర్క్ చేసారో తెలియదు కానీ, ఇప్పుడు ఆ సినిమా కూడా లేదని తెలుస్తోంది. దసరా నుంచి నాగేశ్వర రెడ్డి మరో సినిమా మీదకు వెళ్లిపోతున్నారు. దాంట్లో మంచు విష్ణు హీరో. అంటే సుశాంత్ సినిమా వదిలేసినట్లే అనుకోవాలేమో? 

ఏమైనా అక్కినేని కుటుంబాన్నించి వచ్చిన నాగ్ మేనల్లుళ్లకు ఇధ్దరికీ ప్రస్తుతం చేతిలో సినిమాలు లేవు. మెగాస్టార్ మేనల్లుళ్లు మాత్రం మాంచి జోరు మీద వున్నారు.