దర్శకుడు బోయపాటికి తెలుగుదేశం పార్టీకి వున్న అనుబంధం తెలిసిందే. ఆ పార్టీ ప్రచారానికి మాంచి పొలిటికల్ ప్రకటనలు తయారుచేసి ఇచ్చారు.
గోదావరి పుష్కరాల సమయంలో వీడియో షూట్ లు చేసారు. అందుకే ఆయన మరోసారి ఆ పార్టీకి తన చేయూత అందించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి సినిమా రూపంలో.
బాలకృష్ణ హీరోగా ఫక్తు పొలిటికల్ స్ట్రిప్ట్ ను బోయపాటి రెడీ చేస్తున్నారు. అనిల్ రావిపూడి-బాలయ్య సినిమా తరువాత అంటే వచ్చే ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూట్ ప్రారంభం అయ్యే అవకాశం వుంది. ఆంధ్ర లో ఎన్నికల మూడ్ ను బట్టి ఈ సినిమా కాస్త ముందుకు వెనక్కు వెళ్తుందని తెలుస్తోంది.
ఆంధ్రలో రాజకీయాలు, స్కీములు, వర్తమాన సంఘటనలు అన్నీ ఈ సినిమాలో చోటు చేసుకుంటాయని టాలీవుడ్ లో వినిపిస్తోంది. బాలయ్య నోట పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగులు వుంటాయట.
పొలిటికల్ అంశాలను తెలివిగా కథలో చొప్పించడంలో బోయపాటికి చాలా టాలెంట్ వుంది. దమ్ము సినిమాలో ఎన్టీఆర్..చంద్రబాబు ఫ్యామిలీ మ్యాటర్లు అంతర్లీనంగా చొప్పించారని అప్పట్లో వినిపించింది.
సింహా..లెజెండ్…అఖండ సినిమాలు హిట్ అయిన నేపథ్యంలో అదే కాంబినేషన్ లో రాబోయే సినిమా మీద గట్టి క్రేజ్ ఎలాగూ వుంటుంది. ఈ సినిమాను మిరియాల రవీందర్ రెడ్డి లేదా మరెవరు నిర్మిస్తారో చూడాలి.