దేవదాస్ లో ఫన్ ఎక్కువ.. ఫైట్లు తక్కువంట

దేవదాస్ సినిమాలో నాగ్ మాఫియా డాన్ అనగానే సినిమాలో నాని పుట్టించే ఫన్ తో పాటు, నాగ్ చేసే ఫైట్లు, తుపాకీ కాల్పులు, ఇంతరత్రా వ్యవహారాలు కూడా వుంటాయని వినిపించింది. దీనికితోడు ట్రయిలర్ లో…

దేవదాస్ సినిమాలో నాగ్ మాఫియా డాన్ అనగానే సినిమాలో నాని పుట్టించే ఫన్ తో పాటు, నాగ్ చేసే ఫైట్లు, తుపాకీ కాల్పులు, ఇంతరత్రా వ్యవహారాలు కూడా వుంటాయని వినిపించింది. దీనికితోడు ట్రయిలర్ లో నాగ్ అండ్ కో తుపాకీల కాల్పుల సీన్ కూడా కనిపించింది. కానీ అందుతున్న సమాచారం ప్రకారం, సినిమాలో నాగ్ పేరుకే మాఫియా లీడర్ కానీ, సినిమా ఆద్యంతం మాత్రం నవ్వుల మీదే వెళ్తుందట.

రెండురోజుల క్రితం కొందరు ఇండస్ట్రీ జనాలు దేవదాస్ సినిమా చూసినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి సినిమా కబుర్లు డిస్ట్రిబ్యూషన్ సర్కిళ్ల వరకు వెళ్లాయి. ఈ సమాచారం ప్రకారం నాగ్ మాఫియా బ్లాక్ అన్నది చాలా చిన్నది అని తెలుస్తోంది. ఈ బ్లాక్ అంతా కలిపి ఎంతోసేపు వుండదని తెలుస్తోంది. టోటల్ గా సినిమాను హిల్లేరియస్ ట్రాక్ మీద నడిపించే విధంగానే స్క్రిప్ట్ ను తయారుచేసుకున్నారు.

ముఖ్యంగా ద్వితీయార్థం అంతా నాని ఫుల్ గా నవ్వులు పూయించేసాడని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల కథనం. అలాగే తమిళ నటుడు శరత్ కుమార్ పాత్ర కూడా బాగానే పండిందని తెలుస్తోంది. టాలీవుడ్ లో ఈ మధ్య మల్టీస్టారర్ లు పెరుగుతున్నాయి.

వరుణ్ తేజ్-వెంకీ, చైతూ-వెంకీ సినిమాలు మేకింగ్ లో వున్నాయి. రామ్ చరణ్-ఎన్టీఆర్ సినిమా సంగతి తెలిసిందే. దేవదాస్ కనుక హిట్ అయితే మరిన్ని ప్లాన్ చేసే అవకాశం వుంటుందేమో?