శ్రీవిష్ణు-నారా రోహిత్-సుధీర్ బాబు-శ్రియ నటించిన డిఫరెంట్ చిత్రం వీరభోగ వసంత రాయలు. ఈ సినిమాకు అక్టోబర్ అయిదును విడుదల డేట్ గా ప్రకటించారు. ఇదేరోజు ఇప్పుడు మరో రెండు సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. ఒకటి విజయ్ దేవరకొండ నోటా. మరొకటి చిన్న సినిమా భలే మంచి చౌకబేరమ్.
నోటా సినిమా అవుట్ అండ్ అవుట్ సీరియస్ పొలిటికల్ డ్రామా. ఇక బి, సి సెంటర్లు టార్గెట్ గా వస్తున్న భలే మంచి చౌకబేరమ్ సినిమా కామెడీ జోనర్. వీరభోగ వసంత రాయలు అస్సలు ఏ జోనర్ సినిమా, ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ అన్నది బయటపెట్టకుండా రకరకాల లుక్ లు విడుదల చేసుకుంటూ, పబ్లిసిటీ కూడా కామన్ ఆడియన్ కు అందనంత ఎత్తులో చేస్తూ వచ్చారు.
ఇప్పుడు ఇలాంటి టైమ్ లో అయిదున విడుదలపై ముందువెనుక ఆలోచిస్తున్నట్లు ఇండస్ట్రీ ఇన్ సైడ్ సర్కిళ్లలో వినిపిస్తోంది. థియేటర్ల సమస్యలేదు కానీ, ఓపెనింగ్స్, వారంరోజులు థియేటర్లలో నిల్చోపెట్టడం వంటివి చూసుకోవాలి. మౌత్ టాక్, సమీక్షలు అన్నీ వస్తేనే వీకెండ్ తరువాత కాస్త సినిమా వైపు జనం తిరుగుతారు. కానీ అంతలోనే అరవింద సమేత వీరరాఘవ రెడీ అవుతుంది.
అందుకే ఇవ్వాళ, రేపటిలో విడుదల విషయమై ఓ నిర్ణయం తీసుకుంటారని వినిపిస్తోంది.