దేవదాస్ ఫస్ట్ డే @ 4.57

నాగ్-నాని కాంబినేషన్ లో అశ్వనీదత్ నిర్మించిన శ్రీరామ్ ఆదిత్య సినిమా దేవదాస్. ఈ సినిమా మాంచి బజ్ తోనే రిలీజ్ అయినా, నెలాఖరు కావడం, అది కూడా శుక్రవారం కాకుండా గురువారం విడుదల కావడంతో…

నాగ్-నాని కాంబినేషన్ లో అశ్వనీదత్ నిర్మించిన శ్రీరామ్ ఆదిత్య సినిమా దేవదాస్. ఈ సినిమా మాంచి బజ్ తోనే రిలీజ్ అయినా, నెలాఖరు కావడం, అది కూడా శుక్రవారం కాకుండా గురువారం విడుదల కావడంతో అనుకున్న రేంజ్ కు కలెక్షన్లు వెళ్లలేదు. అయిదు కోట్ల వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి. కానీ 4.57 కోట్ల దగ్గరే ఆగింది. ఈ కలెక్షన్లు నాని కెరీర్ లో ఇప్పటికే కళ్ల చూసినవే. నాగ్ కు మాత్రం కాస్త ఫస్ట్ టైమ్ అనుకోవాలి.

అయితే మౌత్ టాక్ బాగానే వుండడం, ఎంటర్ టైన్ మెంట్ జోనర్ కావడంతో ఫస్ట్ వీకెండ్ నాలుగు రోజులు మంచి వసూళ్లే వస్తాయని అంచనా వేస్తున్నారు. సినిమాను ఒక్క సీడెడ్ మినహా నైజాం కానీ, ఆంధ్ర కానీ అమ్మలేదు. తొలిరోజు వసూళ్లు ఇలా వున్నాయి.

నైజాం………………..1.59
సీడెడ్………………..0.73
వైజాగ్………………..0.58
ఈస్ట్………………….0.39
వెస్ట్…………………..0.26
కృష్ణ…………………..0.32
గుంటూరు……………0.52
నెల్లూరు………………0.18