రవితేజ హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా మాంచి స్పీడ్ మీద వున్నాడు. శ్రీనువైట్ల డైరక్షన్ లో అమర్ అక్బర్ ఆంథోని ఫినిష్ చేసి, మరో సినిమా స్టార్ట్ చేసే పనిలో వున్నాడు. వాస్తవానికి మైత్రీలోనే సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో తెరి రీమేక్ చేయాల్సి వుంది. కానీ వివిధ కారణాలతో దాన్ని పక్కన పెట్టారు.
అందుకే ఇప్పుడు విఐ ఆనంద్ డైరక్షన్ లో చేయబోయే స్క్రిప్ట్ ను లాక్ చేసి, కాస్టింగ్ పనిలో పడ్డారు. చిత్రమేమిటంటే, అమర్ అక్బర్ ఆంథోని సినిమాలో మూడు గెటప్ ల్లో రవితేజ కనిపిస్తే, విఐ ఆనంద్ సినిమాల్లో ముగ్గురు హీరోయిన్లతో కనిపిస్తాడట. ఇప్పటికే ఒక హీరోయిన్ ను ఫైనల్ చేసారు. నన్ను దోచుకుందువటే సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన నభా నటేష్ ఓ హీరోయిన్. మరో ఇద్దరు హీరోయిన్లను ఎంపికచేసే పనిలో పడ్డారు.
విఐ ఆనంద్ కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ లతో కథలు అల్లుకుంటాడు. ముఖ్యంగా థ్రిల్లర్లు అంటే అతగాడికి ఇష్టం. రవితేజతో చేయబోయే సినిమా కూడా సైంటిఫిక్ థ్రిల్లర్ అంట. ఈ జోనర్ లో రవితేజ చేయడం ఇదే ప్రథమం. ఎప్పుడూ మాస్.. మాస్ అనే రవితేజ ఈ జోనర్ లో సినిమా చేస్తే ఎలా వుంటుందో మరి. ఈ సినిమాకు నిర్మాత రామ్ తాళ్లూరి.