దేవీ-ఆదిత్య-మధ్యలో దిల్ రాజు

మేథో సంపత్తి హక్కులు అనేవి ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే వుంటాయి. వన్స్ ఓ ప్రొడెక్ట్ తయారు చేసి ఇచ్చేసి, దానికి తగిన రెమ్యూనిరేషన్ తీసేసుకున్నాక ఇంకా హక్కులు ఏమిటి అని కొందరు అంటారు.  Advertisement రెమ్యూనిరేషన్…

మేథో సంపత్తి హక్కులు అనేవి ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే వుంటాయి. వన్స్ ఓ ప్రొడెక్ట్ తయారు చేసి ఇచ్చేసి, దానికి తగిన రెమ్యూనిరేషన్ తీసేసుకున్నాక ఇంకా హక్కులు ఏమిటి అని కొందరు అంటారు. 

రెమ్యూనిరేషన్ తీసుకున్నది జస్ట్ ఆ వర్క్ వరకే అని దాని పర్మనెంట్ హక్కులు తమవే అని క్రియేటర్స్ అంటుంటారు. టాలీవుడ్ లో హిట్ అయిన ఓ సినిమాను మరో భాషకు అమ్మితే కథకుడికి సగం ఆదాయం అందించడం రివాజుగా వుంది. అయితే మ్యూజిక్ కు సంబంధించి సరైన పద్దతులు లేవు.

అయితే నిర్మాతలు అడియో రైట్స్ ను మ్యూజిక్ కంపెనీకి అమ్మేస్తుంటారు. వాళ్లే కావాల్సిన వారికి అమ్ముతుంటారు. బన్నీ డిజె సినిమాలో 'సీటీమార్' సాంగ్ విషయంలో ఇప్పుడు ఇలాంటి వివాదం ముసురుకుంటోంది. డిజె సినిమాకు నిర్మాత దిల్ రాజు. ఆ సినిమాలోదే సూపర్ హిట్ సీటీమార్ సాంగ్. 

ఇప్పుడు ఆ సాంగ్ ను సల్మాన్ ఖాన్ రాథే సినిమా కోసం తీసుకున్నారు. అయితే అలా తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది మ్యూజిక్ డైరక్టర్ దేవీశ్రీ ప్రసాద్ అని తెలుస్తోంది. కానీ హక్కులు తమవి కదా అని ఆదిత్య మ్యూజిక్ సంస్థ కిందా మీదా అవుతోంది. 

ఈ మేరకు తమకు హక్కులు అమ్మిన నిర్మాత దిల్ రాజు ను ఆదిత్య సంస్థ నిలదీస్తున్నట్లు తెలుస్తోంది. కానీ దేవీతో సినిమాలు లైన్ లో వున్న దిల్ రాజు అటు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారని తెలుస్తోంది.ఎమికబుల్ గా దేవీ కి-ఆదిత్యకు మధ్య సెటిల్ చేయాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ విషయమై సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ ను అడగ్గా, ఏ వివాదం లేదని, ఎవ్విరిథింగ్ ఈజ్ ఓకె అని తెలిపారు.