దిల్ రాజు దారిలో విజయ్

టాలీవుడ్ లో వ్యవహారాలే అలా వుంటాయి. హిట్ లు పడితే ఒకలా వుంటుంది వ్యవహారం. ఫ్లాపులు వస్తే మరోలా వుంటుంది. విజయ్ దేవరకొండ సంగతి ఇప్పడు ఇలాగే వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. డియర్ కామ్రేడ్…

టాలీవుడ్ లో వ్యవహారాలే అలా వుంటాయి. హిట్ లు పడితే ఒకలా వుంటుంది వ్యవహారం. ఫ్లాపులు వస్తే మరోలా వుంటుంది. విజయ్ దేవరకొండ సంగతి ఇప్పడు ఇలాగే వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. డియర్ కామ్రేడ్ విడుదలకు ముందు నిర్మాత దిల్ రాజు హీరో విజయ్ తో సినిమా చేయాలని ప్రయత్నించారు.

వాస్తవానికి గీతగోవిందం తరువాత నుంచి ప్రయత్నిస్తూ వస్తున్నారు. కానీ విజయ్ మాత్రం ఎస్ చెప్పడంలేదు, అలా అని నో చెప్పడంలేదు. రెండు మూడు లైన్లు చెప్పిస్తే బాగున్నాయి అని అనడమే కానీ చేస్తానని అనలేదు. దీంతో దిల్ రాజు తన సన్నిహితుల దగ్గర కాస్త అసంతృప్తి వ్యక్తంచేసాడు కూడా. ఇవన్నీ ఇంతకుముందే వార్తలుగా వచ్చాయి.

కట్ చేస్తే… డియర్ కామ్రేడ్ వచ్చింది. డిజాస్టర్ అయిపోయింది. దీంతో ఇప్పుడు విజయ్ వరుసగా రెండురోజులు దిల్ రాజు ఆఫీసుకు వచ్చి వెళ్లినట్లు తెలుస్తోంది. 'అన్నా..కాస్త వ్యవహారాలన్నీ గజిబిజిగా వున్నాయి. అన్నీ సెటిల్ చేయాల్సివుంది. వారం పదిరోజుల్లో అన్నీ కొలిక్కి వస్తాయి. అప్పుడు మనం కూర్చుని ప్రాజెక్టు ఫైనల్ చేసుకుందాం' అనే రీతిలో దిల్ రాజుతో మాట్లాడినట్లు తెలుస్తోంది.

''..హీరో సినిమా అయోమయంలో పడింది. డియర్ కామ్రేడ్ పరిస్థితి అది. అందువల్ల దానికి కాన్పన్ సేషన్ గా మైత్రీవాళ్లు మరో సినిమా చేయమంటున్నారు. పూరి జగన్నాధ్ ప్రాజెక్ట్ వాళ్లకి చేయాల్సి వచ్చేలా వుంది. అవన్నీ ఫైనల్ అయిన తరువాత మంచి ప్రాజెక్టు మనం చేద్దాం…'' అని విజయ్ దిల్ రాజు కు చెప్పినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ఇవ్వాళో, రేపో విజయ్-పూరి జగన్నాధ్ ప్రాజెక్ట్ ప్రకటన బయటకు వస్తుంది. అంతకు ముందుగా క్రాంతిమాధవ్ సినిమాను ఇప్పడు ప్రారంభించారు. ఇవ్వాల్టి నుంచి వరుసగా షూట్ వుంటుంది. అది అయ్యాక పూరి సినిమా వుండే అవకాశం వుంటుంది.

వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ..?