చాలా దెబ్బలు తిని, తల బొప్పి కట్టి, నైజాం ప్రాంతానికి సినిమాలు కొనడం దాదాపు ఆపేసారు. అలాంటిది బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లోని సన్నాఫ్ సత్యమూర్తిని ఏకంగా 13 కోట్లకు కొన్నారు. ఓ పక్క సినిమాకు యునానిమస్ నెగిటివ్ టాక్ వస్తుంటే, సినిమా వర్గాలు మాత్రం దిల్ రాజు పిచ్చ హ్యాపీగా వున్నాడంటున్నాయి.
పద మూడు రికవరీ అవుతుందని, ఇంకా లాభాలు వస్తాయని దిల్ రాజు ఆనందంగా వున్నాడని అంటున్నాయి సినిమా పీఆర్ వర్గాలు. నైజాంలో పదమూడు పైగా కలెక్ట్ చేయాలంటే సినిమా రెండు వారాల పాటు తిరుగులేకుండా ఆడాల్సి వుంటుంది. కానీ సత్యమూర్తి అంత కాలం తట్టుకుంటుందా అన్నది. త్రివిక్రమ్ కు నైజాంలో బాగుంటుందని ఓ లెక్క వుంది.
రేసుగుర్రం 16 కోట్లు కు పైగా వచ్చింది. అందువల్ల ఇది కూడా ఇబ్బంది పెట్టదని నిర్మాణ వర్గాల అంచనా. కానీ ఈ టాక్ తో తట్టుకుని, 13 దాటుతుందా అని ఓ అనుమానం. ఇదిలా వుంటే సినిమా తొలి రోజు కలెక్షన్లపై చిత్రమైన లెక్కలు వినిపిస్తున్నాయి.
వాస్తవంగా వచ్చింది ఏడు కోట్లుకు పైగా అని కొందరు, కాదు ఎనిమిది కోట్లు పై చిలుకు అని కొందరు అంటున్నారు. కానీ ఏకంగా తొమ్మిది కోట్లకు పైగా వచ్చిందని ప్రచారం అయితే మొదలైపోయింది. థియేటర్ల డైలీ కలెక్షన్ రిపోర్టులు ఎవరు చూసారు కనుక? నిజంగా డైలీ కలెక్షన్ రిపోర్టులు తీస్తే, చాలా రికార్డులు మాయమైపొతాయి.