మహేష్ బాబు సినిమాతో పోటీకి వెళ్లడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ హ్యాట్రిక్ విజయాల తరవాత. ఈ విషయం నిర్మాతైన దిల్‌రాజుకీ బాగా తెలుసు. అయినా సరే, తన ఎవడు సినిమాని ధైర్యంగా విడుదల చేశాడు. అనేక వాయిదాల నేపథ్యంలో క్రేజ్ పోగొట్టుకొన్న తన సినిమాని మహేష్ కి పోటీగా విడుదల చేయడం చూసి.. దిల్‌రాజు చాలా సాహసం చేస్తున్నాడుకొన్నారు సినీ జనాలు.
కానీ వన్‌కి పోటీకి ఎవడు సినిమా విడుదల చేయడం వెనుక పెద్ద మతలబే దాగుంది. వన్ రిజల్ట్ ఈ సినిమా విడుదలకు ముందే దిల్ రాజు తెలుసుకోగలిగాడు. వన్‌లో ఏమీ లేదనే ధీమా వచ్చిన తరవాతే… తన సినిమా విడుదల తేదీ ధైర్యంగా ప్రకటించాడు. వన్ నెగిటీవ్ టాక్…తన సినిమాకి పాజిటివ్ టాక్ గా మారుతుందనేది దిల్ రాజు నమ్మకం.
అయితే ఈ క్లూ ఇచ్చిందెవరనేదే తెలియాల్సివుంది. పైగా సంక్రాంతి సీజన్లో రిలీజ్ తన సినిమాని రిలీజ్ చేసుకోవడం ఎవడుకి అతి పెద్ద ప్లస్. సంక్రాంతికి జనం కోరుకొనేది అచ్చంగా ఇలాంటి సినిమానే. మొత్తమ్మీద దిల్‌రాజు ప్లాన్ బీభత్సంగా వర్కవుట్ అవుతోంది.