చిరు 150వ సినిమా మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇప్పటి విశేషం ఏమిటంటే చిరంజీవి ఈసినిమా గురించి స్వయంగా ప్రకటించడం. 150వ సినిమా ఉంది, దానికి వినాయక్ డైరెక్టర్, చిన్నికృష్ణ కథ ఇచ్చాడు – అంటూ అభిమానుల్ని ఉత్సాహపరిచాడు చిరు. సమయం కూడా చెప్పేశాడు. ఎన్నికల తరవాతే సినిమా అన్నది చిరంజీవి మాట. ఫలితం ఎలాగున్నా మేకప్ వేసుకొంటా – అంటున్నాడు.
చిరంజీవి ఓ సినిమా చేస్తే పొలిటికల్ గా తమకు ఫేవర్‌గా ఉంటుందని కాంగ్రెస్ యోచించింది. అయితే ఎన్నికల ముందు వరకే ఈ బెనిఫిట్. ఒకసారి ఎలక్షన్స్ అయిపోయిన తరవాత, రిజల్ట్ వచ్చిన తరవాత చిరంజీవి చరిష్మాతో కాంగ్రెస్ కి పనేంటి?? లేదు కదా..? అంటే ఈసారి 150వ సినిమాని చిరు పూర్తిన తన కోసం చేసుకొంటున్నాడన్నమాట.
అంటే క్రమంగా రాజకీయాల నుంచి పూర్తిగా తన దృష్టిని సినిమాల వైపు మళ్లించాలనే కదా..? ఒకవేళ 150వ సినిమా పెద్ద హిట్ కొట్టి తనలో సినీ గ్లామర్ ఇంకా తగ్గలేదని నిరూపణ అయితే ఇక పూర్తిగా సినిమాలకు మళ్లీ పునరంకితం అవ్వొచ్చు. లేదంటే రాజకీయాలు ఎలాగూ ఉన్నాయి. అంటే రెండు వైపుల ఆట చిరంజీవిదే అన్నమాట. ఆలస్యంగా తీసుకొన్నా, చిరునిర్ణయం తనకు ఇలా ఫేవర్ చేస్తోందన్నమాట.