అసలే సినిమా డిస్ట్రిబ్యూషన్ లాస్ లో నడుస్తోంది. నిర్మించిన సినిమాల్లో వచ్చిన లాభాలను కొన్న సినిమాలు తినేస్తున్నాయి అన్న పరిస్థితి టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజుది. అలాంటిది ఇప్పుడు మరో ఏడుకోట్ల భారం పడింది. ఆ మధ్య జీఎస్టీ సెల్ అధికారులు ఇండస్ట్రీలోని అనేక సినిమా ఆఫీసుల మీద దాడిచేసి, లెక్కలు ఆరాతీసారు. అలా తీసినపుడు దిల్ రాజు ఏడుకోట్లు బకాయి లేదా కట్టకపోవడం అన్నది గుర్తించారు.
ఆ మేరకు నోటీస్ ఇచ్చారు. లెక్కలన్నీ చూసి వెంటనే రెండుకోట్లు కట్టారు. ఇప్పుడు మిగిలిన అయిదు కోట్లు కూడా కట్టి తీరాల్సిందే అని చెప్పారట. దాంతో ఇప్పుడు ఒక్కసారిగా అయిదు కోట్లు కట్టాల్సి వచ్చింది. దాంతో కిందామీదా అవుతున్నారు. అయిదు కోట్లు కట్టేస్తే క్లీన్ చిట్ వచ్చేస్తుంది.
కేవలం దిల్ రాజుకే కాదు, ఇండస్ట్రీలో చాలా సంస్థలు ఇప్పుడు జీఎస్టీ తలకాయనొప్పి ఎదుర్కోంటున్నాయి. పాత లెక్కలు బయటకు తీసి నోటీసులు ఇస్తున్నారు. సినిమాలు ఫ్లాప్ అయి, నష్టపోయింది చాలక, మళ్లీ ఇప్పుడు ఈ జీఎస్టీ పోటు ఒకటి అని తల పట్టకుుంటున్నారు చాలామంది నిర్మాతలు.