రవితేజ బెంగాల్ టైగర్ విడుదల కాకుండానే కొత్త ప్రాజెక్టు రెడీ అయిపోయింది. దిల్ రాజు నిర్మాతగా, వేణు శ్రీరామ్ దర్శకుడిగా సినిమా అనుకున్నారు. అది కాస్తా ఇప్పుడు ఆగిపోయింది..ఆ సంగతి తెలిసిందే..సమస్య ఏమిటి? అంటే రెమ్యూనిరేషన్ దగ్గర తకరారు..అని టాక్..అదీ తెలిసిందే.
అయితే దీని వెనుక ఆసక్తికరమైన విషయం ఇంకోటుంది అని వినిపిస్తోంది ఇప్పుడు. బెంగాల్ టైగర్ ముందు కిక్ 2 డిజాస్టర్ తో వున్నాడు రవితేజ. బహుశా అందువల్ల కావచ్చు..రెమ్యూనిరేషన్ కాకుండా ప్రాఫిట్ షేరింగ్ టైపులో సినిమా చేయడానికి ఓకె అన్నాడని వినికిడి. తీరా బెంగాల్ టైగర్ ముఫై కోట్లకు పైగా బిజినెస్ చేయడంతో, పార్టనర్ షిప్ వద్దు..రెమ్యూనిరేషన్ కావాలన్నాడని తెలుస్తోంది.
అదిగో అప్పుడు వచ్చిందట రెమ్యూనిరేషన్ డిస్కషన్..అక్కడ మళ్లీ తేడా కొట్టింది..సినిమా ఆగిపోయింది..రవితేజ సినిమా అప్పుడు రంజిత్ మూవీస్ కోర్టులోకి వెళ్లిపడింది..అక్కడ ఎప్పుడు సర్వ్ అవుతుందోచూడాలి మరి.