Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నేను మంచోడ్ని.. మోహన్ లాల్ బీద అరుపులు

నేను మంచోడ్ని.. మోహన్ లాల్ బీద అరుపులు

ప్రముఖ నటిని లైంగికంగా వేధించిన కేసులో జైలులో ఉండి బెయిల్ పై విడుదలైన దిలీప్ ను మోహన్ లాల్ వెనకేసుకొచ్చాడనేది మలయాళ చిత్రపరిశ్రమలో బహిరంగ రహస్యం. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)కు అధ్యక్షుడి హోదాలో ఉండి కూడా, దిలీప్ ను అమ్మ సభ్యత్వానికి రాజీనామా చేయమని అడగలేదు మోహన్ లాల్.

దీనిపై మలయాళ మహిళా నటులు భగ్గుమన్నారు. మోహన్ లాల్ వ్యవహారశైలిని నిరసిస్తూ రేవతి, పద్మప్రియ, పార్వతి లాంటి నటులు అమ్మ ఉపసంఘమైన WCCకి రాజీమానా చేశారు. దీనిపై కొన్ని నెలలుగా అమ్మ అట్టుడికిపోతోంది. ఎట్టకేలకు దిలీప్ రాజీనామా చేశాడు. అయినప్పటికీ మోహన్ లాల్ మరోసారి తన బుద్ధి చూపించాడు.

ఈనెల 10న దిలీప్ రాజీనామా చేసినప్పటికీ.. రేవతి, పద్మప్రియ, పార్వతి లాంటి మహిళా నటులతో రాజీకి ప్రయత్నించాడు మోహన్ లాల్. వాళ్లను సమావేశానికి రావాల్సిందిగా 11వ తేదీన లేఖలు పంపాడు. మహిళా నటులతో చర్చలు కొలిక్కి రాకపోవడంతో, దిలీప్ రాజీనామా చేసిన విషయాన్ని 10 రోజుల తర్వాత బయటపెట్టాడు. దిలీప్ ను మోహన్ లాల్ ఎంతలా వెనకేసుకొస్తున్నాడని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ అక్కర్లేదు.

ఇంత జరిగినా తను అమాయకుడ్ని అంటున్నాడు మోహన్ లాల్. "దిలీప్ ను రాజీనామా చేయమని అడిగింది నేనే, అతడు రాజీనామా చేసిన తర్వాత వెంటనే ఆమోదించింది కూడా నేనే. కానీ నాపై వేలెత్తి చూపిస్తున్నారు. నేను కూడా ఓ సామాన్య మనిషినే. నాక్కూడా ఫీలింగ్స్ ఉంటాయి. నాకు సంబంధం లేని విషయంలో నన్ను వేలెత్తి చూపించడం బాధాకరం."

ఇలా తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు మోహన్ లాల్. నిజానికి ఏదైనా ఒక అసోసియేషన్ లో సభ్యుడు విచారణ ఎదుర్కొంటున్నప్పుడు నైతిక బాధ్యతగా ఆ సంఘానికి రాజీనామా చేయాలి. ఎక్కడైనా ఇలానే జరుగుతుంది. కానీ "అమ్మ" నుంచి దిలీప్ బయటకెళ్లడానికి ఇన్ని రోజులు పట్టింది. కారణం మోహన్ లాల్.

మొత్తానికి దిలీప్ రాజీనామాతో మలయాళ చిత్రసీమలో మహిళా నటులు తమ హక్కుల్ని కాపాడుకున్నట్టయింది. వ్యవహారం కొలిక్కి రావడంతో ఇకపై తనజోలికి ఎవరూ రారని మోహన్ లాల్ అనుకోవచ్చు. కానీ "అమ్మ"లో మహిళా సభ్యులెవరూ అతడ్ని భవిష్యత్తులో నమ్మే పరిస్థితిలో లేరు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?