Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నవంబర్ 16న టాక్సీవాలా

నవంబర్ 16న టాక్సీవాలా

విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీ టాక్సీవాలాకు డేట్ ఫిక్స్ అయింది. నవంబర్ 16న విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ సినిమాను దీపావళికి విడుదలచేయాలని అనుకున్నారు. కానీ అది బుధవారం అయింది. పైగా తెలుగువాళ్లకు అమావాస్య అంటే చిన్న అనుమానం. అందుకే నవంబర్ 16 బెస్ట్ అని డిసైడ్ అయ్యారు.

సిజి వర్క్, పూర్తి పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. అలాగే సినిమా రా ఫుటేజ్ లీక్ గాయాలు ఇప్పడిప్పుడే మానుతున్నాయి. అందుకే ఇక ప్రచారం మీద విడుదల మీద దృష్టి పెట్టాలని ఫ్రంట్ ఎండ్ లో వున్న నిర్మాత, ఎస్ కెఎన్, యువి క్రియేషన్స్, బ్యాక్ ఎండ్ లో వున్న బన్నీ వాస్, మారుతి నిర్ణయించినట్లు బోగట్టా.

విజయ్ దేవరకొండ కొద్దిరోజుల్లో డియర్ కామ్రేడ్ సినిమా షూట్ నుంచి వచ్చాక ఈ సినిమా ప్రమోషన్లు  మీద దృష్టి పెడతారు. నవంబర్ 2న చైతన్య సవ్యసాచి విడుదవుతోంది. నవంబర్ ఎనిమిదిన బాలీవుడ్ భారీ సినిమా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ విడుదల వుంది.

టాక్సీవాలా విడుదల నాటికి పెద్దగా భయపడాల్సిన, భయపెట్టే సినిమాలు అయితే ఏవీలేవు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?