దిల్‌ రాజు ఈసారి దొరికేస్తాడా?

నిర్మాతగా దిల్‌ రాజుకి ఈ ఏడాది భలేగా కలిసి వచ్చింది. అతను తీసిన సినిమాలన్నీ నిర్మాతగా లాభాలు తెచ్చిపెట్టాయి. డిజె, రాజా ది గ్రేట్‌ చిత్రాలతో బయ్యర్లకి స్వల్ప నష్టాలు వచ్చినప్పటికీ అవేమీ అంత…

నిర్మాతగా దిల్‌ రాజుకి ఈ ఏడాది భలేగా కలిసి వచ్చింది. అతను తీసిన సినిమాలన్నీ నిర్మాతగా లాభాలు తెచ్చిపెట్టాయి. డిజె, రాజా ది గ్రేట్‌ చిత్రాలతో బయ్యర్లకి స్వల్ప నష్టాలు వచ్చినప్పటికీ అవేమీ అంత ప్రభావం చూపించేవి కావు. అయిదు సినిమాలతోను నిర్మాతగా లాభాలు చవిచూసిన దిల్‌ రాజు ఇదే ఊపులో ఆరవ విజయం సాధించాలనే కసితో 'మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి' చిత్రాన్ని ఇదే ఏడాదిలో విడుదల చేస్తున్నాడు.

అయితే ఇంతవరకు దిల్‌ రాజుకి కాలం కలిసి వచ్చింది. అతని బ్యానర్‌ నుంచి వచ్చిన వీక్‌ సినిమాలైన డిజె, రాజా ది గ్రేట్‌లకి పోటీ లేకపోవడం ప్లస్‌ అయింది. దాని వల్ల ఓపెనింగ్స్‌ బాగా రాబట్టుకుని యావరేజ్‌ మార్కుని చేరుకోగలిగాయి. కానీ 'ఎంసిఏ' చిత్రానికి 'హలో'తో పోటీ వుంది. ప్రమోషన్ల దగ్గర్నుంచి ప్రోమోల వరకు, ఆడియో దగ్గర్నుంచి సినిమాకున్న క్రేజ్‌ వరకు హలో డామినేట్‌ చేస్తోంది.

ట్రెయిలర్‌, ఆడియో అన్నీ కూడా 'ఎంసిఏ'వి 'హలో' కంటే చాలా వీక్‌గా వున్నాయి. పైగా ఆ చిత్రానికి నాగార్జున, విక్రమ్‌కుమార్‌ల బ్రాండింగ్‌ కూడా వుంది. ఇంతవరకు కొన్ని నాసి రకం సినిమాలు అందించినా కానీ పాస్‌ అయిపోయిన దిల్‌ రాజుకి ఈసారి గట్టెక్కడం అంత ఈజీ కాదు. హలో అంచనాలని అందుకోవడంలో విఫలమయితే తప్ప ఈ రొటీన్‌ 'మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి'కి ప్రేక్షకాదరణ కష్టం కావచ్చు.