ఫ్యాన్ తో డైరక్టర్ చెట్టపట్టాల్ ?

రచయితలు, నటులు, దర్శకులు, కళాకారులు అంటే ఫ్యాన్స్ ఓ లేక్కలో వుంటారు. వుండడమే కాదు వారి కోసం ప్రాణాలిచ్చేంతగా అభిమానించేస్తారు. ఆ పిచ్చి అభిమానం ఎక్కడికో వెళ్లిపోతుంటుంది ఒక్కోసారి.  Advertisement ఇటీవల టాలీవుడ్ లో…

రచయితలు, నటులు, దర్శకులు, కళాకారులు అంటే ఫ్యాన్స్ ఓ లేక్కలో వుంటారు. వుండడమే కాదు వారి కోసం ప్రాణాలిచ్చేంతగా అభిమానించేస్తారు. ఆ పిచ్చి అభిమానం ఎక్కడికో వెళ్లిపోతుంటుంది ఒక్కోసారి. 

ఇటీవల టాలీవుడ్ లో ఓ దర్శకుడు ఇలాంటి అభిమాని అభిమానాన్ని తనకు అనుకూలంగా వాడేసుకున్నట్లు గ్యాసిప్ వినిపిస్తోంది. టాలీవుడ్ లోని ఓ పెద్ద దర్శకుడు అంటే అభిమానం వున్న ఓ అమ్మాయి విదేశాల నుంచి వచ్చి అతగాడిని కలిసినట్లు తెలుస్తోంది. 

మూడు నాలుగు రోజులు వరుసగా కలిసిన తరవాత స్నేహం పెరిగినట్లు బోగట్టా. నగరంలోని ఓ పెద్ద హోటల్ లో నెల రోజుల పాటు వున్నట్లు, తరచు ఇద్దరు ఆ హోటల్ లోనే కలిసినట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.

కొంతమంది సినిమా జనాలకు మాదిరిగానే ఆ డైరక్టర్ కు కూడా కాస్త అమ్మాయిల ఇంట్రస్ట్ వుందని ఇప్పటికే టాక్ వుంది. అయితే లేనిపోని తలకాయనొప్పులు వస్తాయని జాగ్రత్తగా వుంటారని టాక్ కూడా వుంది. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా ఇలాంటి గ్యాసిప్ వినిపించడం కాస్త ఆశ్చర్యంగానే వుంది.

గ్రేటర్ కొడతాడా? ఇజ్జత్ నిలుస్తుందా?