క్రేజీ స్టంట్ మాస్టర్ పీటర్ హైన్స్ డైరక్టర్ గా మారుతున్నారు. ఎప్పటి నుంచో ఆయన డైరక్టర్ కావాలనుకుంటున్నారు. ఇప్పటికి అది మెటీరియలైజ్ అవుతోంది. నల్లమలపు బుజ్జి నిర్మాతగా పీటర్ హైన్స్ డైరక్షన్ లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎవరు హీరొ? ఎప్పుడు స్టార్ట్? అన్నది ఇంకా వెల్లడికావడం లేదు.
పీటర్ హైన్స్ ఫైట్స్ అంటే ఓ రేంజ్ లో వుంటాయి. మరి సినిమా మొత్తం స్టంట్స్ తోనే వుంటాయా? అలాంటి సినిమా చేసే హీరో ఎవరు అన్నది చూడాలి. గతంలో ఫైట్ మాస్టర్ విజయన్ కూడా ఓ సినిమా చేసారు. కేవలం పైట్స్ తో సినిమా ఆడదు. సరైన స్క్రిప్ట్, స్టార్ వుంటేనే యాక్షన్ సీన్లు యాడ్ అవుతాయి.
మరి పీటర్ హైన్స్ ఎవరిని తీసుకుంటున్నారో? స్క్రిప్ట్ ఏమిటో చూడాలి. మొత్తం మీద తెలుగు తెరకు మరో కొత్త డైరక్టర్ పరిచయం అవుతున్నారు ఈ విధంగా.